Top Stories

టీవీ5 టీటీడీ నాయుడికి ఇచ్చిపడేశారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీటీడీ, తిరుపతి లడ్డూ, హెరిటేజ్ సంస్థలపై వివాదం మరింత ముదురుతోంది. వైసీపీ సీనియర్ నాయకుడు, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వం మరియు టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

శాసన మండలి మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ, దేవదేవుడి ప్రసాదంపై తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించారని చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రసాదంలో కొవ్వు కలిసిందని ప్రచారం చేయడం మహాపాపమని అన్నారు. ఈ అంశంపై చర్చకు రావాలని కోరితే ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు.

ఇందాపూర్ డెయిరీ, హెరిటేజ్ సంస్థల మధ్య సంబంధాలపై ప్రశ్నలు లేవనెత్తిన బొత్స, ఆ ఒప్పందాల వెనుక ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని విమర్శించారు. నిజం బయటపడుతుందనే భయంతోనే చర్చకు ప్రభుత్వం దూరంగా ఉందని అన్నారు. హెరిటేజ్ సంస్థపై లీగల్ నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

టీటీడీ చైర్మన్ పాత్రపై కూడా బొత్స ప్రశ్నలు లేవనెత్తారు. టీటీడీపీ తరఫున ప్రకటనలు చేయడం సరికాదని, అవసరమైతే పదవి నుంచి తప్పుకుని మాట్లాడాలని సూచించారు. దేవదేవుడిపై నిందలు వేసిన వారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్ కుమార్, కల్పలతారెడ్డి కూడా ఇదే అంశంపై స్పందిస్తూ, తిరుపతి లడ్డూ మరియు ఇందాపూర్ వ్యవహారంపై సభలో పూర్తి స్థాయి చర్చ జరపాలని డిమాండ్ చేశారు. హెరిటేజ్ సంస్థకు ఇచ్చిన రాయితీలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.

ఈ వివాదం రాజకీయంగా మరింత ఉత్కంఠ రేపుతుండగా, సభలో చర్చ జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Trending today

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

ఏపీలో భూకంపం

  గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతాలలో భూకంపం చోటుచేసుకుంది....

ఇందాపూర్ డెయిరీపై ఎన్టీవీ బిగ్ బ్లాస్ట్.. హెరిటేజ్‌తో సంబంధాలేమిటి?

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల నెయ్యి టెండర్ల వివాదం మళ్లీ చర్చకు దారి...

మోహన్ బాబు అరెస్ట్.. హైకోర్టు షాక్!

  తిరుపతి: నటుడు మంచు మోహన్ బాబుకు ఏపీ హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ...

Topics

లోకేష్ కే పగ్గాలు.. పవన్ బయటకు.. బీజేపీ ప్లాన్ ఏంటి?

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. ఎన్నికలు లేకపోయినా రాజకీయ చర్చలు...

రఘురామకృష్ణంరాజుకు షాక్.. సొంత పార్టీలోనే వివాదం!

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం...

తిరునాళ్లలో ‘మద్యం’ ప్రసాదం.. జైహో కూటమి సర్కార్

భక్తిభావంతో పులకించాల్సిన కోటప్పకొండ శివరాత్రి తిరునాళ్లు.. ఈసారి ‘మద్యం’ ఘాటుతో వార్తల్లోకి...

Related Articles

Popular Categories