ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త డ్రామా మొదలైంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ విషయాన్ని ముందుకు తీసుకురావడంలో టీడీపీకి చెందిన ఇద్దరు మహిళా మంత్రులు — వంగలపూడి అనిత మరియు సంజీవ రెడ్డి సవిత — కీలక పాత్ర పోషించారు. కానీ వీళ్ల స్టైల్ జనాలకు పట్టలేదనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ.
అనిత తనదైన రీతిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి జగన్ కాలేజీలు కట్టలేదని ఆరోపించారు. మరోవైపు సవిత ఫీల్డ్‌లో డ్రామా ఆడుతూ కాలేజీల పరిస్థితి సరిగ్గా లేదని చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఈ రెండు ప్రయత్నాలు ఒక్కసారిగా ట్రోల్ బాంబుల వర్షంగా మారాయి.
జనాలు, జగన్ అభిమానులు మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ ఇద్దరు మంత్రులను ట్యాగ్ చేస్తున్నారు. “ఇది కట్టింది ఎవరు?”, “ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి, మీరు ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు?” అంటూ ప్రశ్నలు విసురుతున్నారు.
దీంతో అనిత, సవిత చేసిన రాజకీయ ప్రయత్నాలు రివర్స్ అయ్యాయి. మంత్రులు చెప్పిన మాటలు బూమరాంగ్ అవ్వడంతో వారి పరువు పోతుంది. ఇక సోషల్ మీడియాలో అయితే ట్రోల్స్, మీమ్స్, కౌంటర్లు వరదలా వస్తున్నాయి.
ఇలా చూస్తుంటే వైసీపీ నిర్మించిన మెడికల్ కాలేజీలు ఇప్పుడు టీడీపీకి తలనొప్పిగా మారాయి. ప్రజలు నేరుగా గ్రౌండ్ రిపోర్టులు చూపించడం వల్ల ఈ ఇష్యూ టీడీపీ ప్లాన్ చేసిన విధంగా ప్లస్ అవ్వక మైనస్‌గా మారినట్టే కనిపిస్తోంది.