Top Stories

మనిషివా.. ‘జేసీ’వా?

 

తాడిపత్రి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) నాగరాజ నాయుడుపై వీరంగం సృష్టించారు. తాను చెప్పిన పనులు చేయలేదనే ఆగ్రహంతో డీపీఓను అందరి ముందు ఇష్టమొచ్చినట్లు తిట్టడమే కాకుండా, బూతులు తిడుతూ బెదిరింపులకు దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తన ఆదేశాలను పాటించకపోతే అంతు చూస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి డీపీఓను బెదిరించినట్లు తెలుస్తోంది. “బీ కేర్‌ఫుల్‌.. రేపు మీ ఆఫీస్‌కు వ‌చ్చి కొడ‌తా” అంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరించడం అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది. ఒక ప్రజాప్రతినిధి, పైగా మాజీ ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి ప్రభుత్వ అధికారి పట్ల ఇలా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. “ఇదేనా ఏపీ సీఎం చంద్రబాబు తన టీడీపీ నేతలకు నేర్పిన సంస్కారం?” అంటూ సామాజిక మాధ్యమాల్లో నిప్పులు చెరుగుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా నిలబడాల్సిన సమయంలో ఇలాంటి అనుచిత ప్రవర్తన శోచనీయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం, టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

https://x.com/YSRCParty/status/1945889961305338252

Trending today

సజ్జల చేతిలో మళ్లీ సాక్షి మీడియా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన సజ్జల రామకృష్ణారెడ్డి మళ్లీ...

అక్కినేని నాగార్జునకు ‘దువ్వాడ’ గండం!

బిగ్ బాస్ హౌస్ లో మాధురి ఎలిమినేషన్ తర్వాత దువ్వాడ శ్రీనివాస్...

‘బాబు’ వాయించాడు.. అస్సలు నవ్వకండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ నెల 1వ తేదీని ఇప్పుడు...

జగన్, పవన్ పై ‘ఉండవల్లి’ కథ

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ ప్రస్తుతం రాజకీయాల్లో లేరు. కానీ...

టీవీ5 సాంబశివకు రెండు ప్రశ్నలు

కాశిబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. టీవీ5...

Topics

సజ్జల చేతిలో మళ్లీ సాక్షి మీడియా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన సజ్జల రామకృష్ణారెడ్డి మళ్లీ...

అక్కినేని నాగార్జునకు ‘దువ్వాడ’ గండం!

బిగ్ బాస్ హౌస్ లో మాధురి ఎలిమినేషన్ తర్వాత దువ్వాడ శ్రీనివాస్...

‘బాబు’ వాయించాడు.. అస్సలు నవ్వకండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ నెల 1వ తేదీని ఇప్పుడు...

జగన్, పవన్ పై ‘ఉండవల్లి’ కథ

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ ప్రస్తుతం రాజకీయాల్లో లేరు. కానీ...

టీవీ5 సాంబశివకు రెండు ప్రశ్నలు

కాశిబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. టీవీ5...

జోగి రమేష్ అరెస్టు వెనుక రాజకీయ కథ!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నేతల్లో జోగి రమేష్ ఒకరు....

జోగి రమేష్ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న నకిలీ మద్యం కేసు మరో కీలక...

తొక్కిసలాట ఘటన పై సంచలన వీడియో

కాశిబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సంచలన వీడియో బయటకు రావడంతో ప్రభుత్వం,...

Related Articles

Popular Categories