ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీటింగ్ అంటే.. అది ‘మ్యారథాన్ సెషన్’గానే ఉంటుందని ప్రభుత్వ వర్గాలకు బాగా తెలుసు. గంటలు గంటలు సాగించే ఆయన ప్రసంగాలు.. సున్నితమైన అంశాలను కూడా చాలా విపులంగా వివరించడం ఆయన స్టైల్. కానీ ఈ పద్ధతికి ఇప్పుడు కొత్త ఎఫెక్ట్ వచ్చేసింది.
తాజాగా కలెక్టర్ల సమావేశంలోనూ చంద్రబాబు పాత స్టైల్ రిపీట్ అయ్యింది. సుదీర్ఘంగా గంటల తరబడి ఆయన మాట్లాడుతూనే ఉండటంతో అధికారులు, మంత్రులు ఓపిక పట్టాల్సి వచ్చింది. అయితే, ఈసారి అసలు హైలైట్ మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్షన్స్.
మీటింగ్ అంతా ఆయన కొన్నిసార్లు ఫోన్ చూడడం, కొన్నిసార్లు జీడిపప్పు నములడం, ఇంకోసారి విసుగ్గా చూసిన హావభావాలు సోషల్ మీడియాలో హైలైట్ అయ్యాయి. “ఇంకా అయిపోలేదా?” అన్నట్టుగా ఆయన ఎక్స్‌ప్రెషన్స్ కనిపించడంతో, నెటిజన్లు వాటిని క్లిప్ చేసి వైరల్ చేశారు.
చంద్రబాబు ఎంతగానో లోతుగా ఆలోచించే లీడర్ అయినా.. ప్రతి అంశాన్ని మినిట్లకొద్దీ వివరించడం వల్ల మీటింగ్స్ బరువెక్కిపోతున్నాయని విమర్శలు ఉన్నాయి. ఆ సమయం ఫలితాలకంటే కేవలం వింటూ కూర్చోవడానికే ఎక్కువ అవుతోందన్న అభిప్రాయం అధికారుల్లో ఉంది.
పవన్ ఎక్స్‌ప్రెషన్స్‌కి సోషల్ మీడియాలో భారీ క్రేజ్ వచ్చింది. ఆయన ఓపిక కోల్పోయినట్లుగా కనిపించడం నెటిజన్లకు బాగా కనెక్ట్ అయ్యింది. “మనం అనుకునేదే పవన్ ఫీల్ అయ్యాడు” అని ఫన్ కామెంట్లు చేస్తున్నారు.
మొత్తం మీద చంద్రబాబు మీటింగ్స్‌కి “తొక్కల మీటింగ్స్” అన్న ట్యాగ్ పడితే, పవన్ ఎక్స్‌ప్రెషన్స్ మాత్రం వైరల్ అవుతూ రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశమయ్యాయి.