అసెంబ్లీలో మాజీ సీఎం జగన్, వైసీపీపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సొంత రాజకీయ వాతావరణంలో కొత్త వాదనలకు కారణమయ్యాయి. బాలకృష్ణ, మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి, అసెంబ్లీ లో “సైకో” అనే పదాన్ని ఉపయోగించిన సంగతి మీడియాలో హైలెట్ అయ్యింది.
రాజకీయ విశ్లేషకులు ఈ వ్యాఖ్యలను అత్యంత అసభ్యమైన విధంగా తప్పుపడుతున్నారు.. బాలయ్య సైకో వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.. గతంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా సభాసభ్యత ను దిగజార్చాయని… నిజమైన సైకో బాలయ్యనే అని దుమ్మెత్తిపోస్తున్నారు. గతంలో బాలయ్య ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు ‘సైకో’ సర్టిఫికెట్ తీసుకున్నాడని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.. “సభ్యత, సంస్కారం లేని వాగుడు వల్ల అసెంబ్లీ చర్చలు ప్రభావితమవుతాయి. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఈ విధంగా ఉద్దేశించి, ‘సైకో’ అనడం అనుచితమే.” అంటూ మండిపడుతున్నారు.
బాలకృష్ణకు ఈ మాటలు గుర్తు పెట్టుకోవాలని.., ఎందుకంటే సామాజికంగా రాజకీయంగా ప్రతిస్పందన వైసీపీ అధికారంలోకి వచ్చాక తప్పనిసరిగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
అసెంబ్లీ లో చేసిన వ్యాఖ్యలు, సభ్యతా విలువలను గుర్తు పెట్టుకొని, రాజకీయంగా బాధ్యతాయుతంగా ఉండాలి. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, నిజానికి, రాజకీయ, సామాజిక దృష్ట్యా సరైనవి కావు