బాపట్ల రాజకీయ వాతావరణాన్ని కుదిపేసిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. టిడిపి ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడైన సుబ్రహ్మణ్య గుప్తా యాజమాన్యంలో నడుస్తున్న కోల్డ్‌స్టోరేజ్‌లో భారీ స్థాయిలో గోమాంసం నిల్వ ఉంచిన విషయం బయటపడింది.
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు రహస్య సమాచారంతో దాడి చేసి, సుమారు లక్షా 89 వేల కిలోల గోమాంసంను స్వాధీనం చేసుకున్నారు. ఈ సీజ్ తర్వాత జిల్లా రాజకీయాల్లో హల్‌చల్ రేపింది.
దర్యాప్తులో అధికారులు గోమాంసం సరఫరా వ్యవస్థ వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించినట్లు సమాచారం. వీరిని పోలీసులు రహస్యంగా విచారిస్తున్నప్పటికీ, టిడిపి నేతల ప్రమేయం బయటపడకుండా చర్యలు తీసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
గోమాంసం పెద్ద ఎత్తున పట్టుబడటంపై హిందూ ధార్మిక సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. “ఇంత పెద్ద స్థాయిలో గోమాంసం నిల్వ చేయడం సాంస్కృతిక విలువలకు విరుద్ధం” అంటూ మండిపడుతున్నాయి.
ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వైసీపీ నేతలు టార్గెట్ చేసి ప్రశ్నిస్తున్నారు.. “ మీ ప్రభుత్వంలోని కూటమి ఎమ్మెల్యే సన్నిహితుడి గోడౌన్ లో ఇంత పెద్ద పాపం చేసిన తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష పెట్టి, ఇప్పుడు ఏ గుడి మెట్లు కడుగుతావ్?” అంటూ విమర్శించారు.
ఇంత భారీ స్థాయిలో గోమాంసం పట్టుబడినా, ఇప్పటి వరకు పోలీసు ఉన్నతాధికారుల నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇది మరింత అనుమానాలకు తావిస్తోంది.
ఈ ఘటనతో బాపట్ల రాజకీయాల్లో కొత్త పుట తిరిగింది. దర్యాప్తు ఎటు దారితీస్తుందో, ఎవరెవరి పేర్లు బయటపడతాయో చూడాలి.
https://x.com/JaganannaCNCTS/status/1987818287544344695?s=20

