ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మద్యం కుంభకోణం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన ఈరోజు జైలు నుంచి విడుదల కానున్నారు.
18 వేల కోట్ల మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తూ సిట్ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఆరోపణలతో అరెస్టు చేశారు. అనేకసార్లు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతించాలని దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఈనెల 11న సాయంత్రం ఐదు గంటలకు తిరిగి సరెండర్ కావాలని కోర్టు షరతు విధించింది. మిథున్ రెడ్డి జైలు నుంచి బయటకు రానుండటంతో వైసిపి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.