ఎమ్మెల్యేలకు కొత్త పరీక్ష పెట్టిన చంద్రబాబు

ఊరికే ఉండరు మహానుభావులు అని.. ఇప్పటికే రోడ్లు వేసి టోల్ టాక్స్ వసూలు చేస్తానంటూ రాష్ట్రమంతా వాహనదారులకు షాకిచ్చారు చంద్రబాబు. దీంతో చిన్న చితకా గ్రామస్థాయి రోడ్లు బాగు అయినా కూడా కొందరు టీడీపీ నేతలు ప్రైవేటుగా టోల్ ట్యాక్సులు వసూలు చేస్తూ వాహనదారులను దోచుకుంటున్నారు.

ఇప్పుడు ఈ రభస కంటిన్యూ అవుతుండగానే చంద్రబాబు తన టీడీపీ ఎమ్మెల్యేలకు కొత్త టాస్క్ పెట్టాడు. సంక్రాంతికి ప్రతీ ఆంధ్ర కుటుంబం సొంత ఊరుకు రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంక్రాంతికి ఊరికి వచ్చిన ఏ ఒక్కరైనా రోడ్డు బాగాలేదని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఇక అంతే సంగతులు అట.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేను బాధ్యులను చేసి తాట తీస్తానంటూ బాబు గారు హుకూం జారీ చేశారు.

దీంతో ఏపీ జనాలు తమ ఊరి రోడ్లపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి రెడీ అవ్వండి అంటూ పిలుపునిస్తున్నారు. ఇది ప్రజల అసౌకర్యాన్ని తీర్చడంతోపాటు ఎమ్మెల్యేలకు కొత్త పరీక్షగా మారనుంది.

దీంతో ఎమ్మెల్యేలంతా ఇప్పుడు నియోజకవర్గంలోని రోడ్లను వేయడానికి.. గుంతలు పూడ్చడానికి రెడీ అయిపోతున్నారు. చంద్రబాబు పండుగ ముందర మాకు కొత్త టెన్షన్ పెట్టారని టీడీపీ ఎమ్మెల్యేలంతా కంగారు పడుతున్నారు.