Top Stories

చంద్రబాబు సంచలనం : ముఖ్యమంత్రిగా లోకేష్

తెలుగుదేశం పార్టీ భవిష్యత్‌ నాయకత్వంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నారా లోకేష్‌కు త్వరలోనే కీలక పదవి దక్కనుందా? అనే సందేహాలు పార్టీ శ్రేణులు, రాజకీయ విశ్లేషకుల మధ్య ఉత్కంఠన పెంచుతున్నాయి. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలా? లేక మరింత పెద్ద స్థాయిలో జాతీయ అధ్యక్ష బాధ్యతలకే పంపించాలా? అనే అంశంపై ఇప్పటికే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

మహానాడు సందర్భంగా పార్టీ తరఫున లోకేష్‌కు ప్రమోషన్ ప్రకటిస్తారనే వార్తలు ఊదెత్తగా చివరకు ఆ ప్రకటన వెలువడకపోవడం పార్టీ శ్రేణుల్లో నిరాశ కలిగించింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన తీర్మానాల్లో కూడా లోకేష్‌కు పెద్ద పదవి అప్పగించాలనే డిమాండ్ స్పష్టంగా కనిపించింది. అయితే చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకోవడంలో తనదైన శైలిలో ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది.

ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘లోకేష్‌కు సీఎం పదవి ఎప్పుడు?’’ అన్న ప్రశ్నకు స్పందిస్తూ – ఈ దిశగా ఇంకా సమయం ఉందని, లోకేష్‌ తన ముద్రను ఖచ్చితంగా చాటుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కృషి చేస్తే లక్ష్యం సాధ్యమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇలా నేరుగా ప్రకటించకపోయినా భవిష్యత్‌లో ఆ బాధ్యతలు లోకేష్‌ చేతిలోకి రావొచ్చన్న సంకేతాలు ఇచ్చారు.

లోకేష్ విషయమై గతంలో టీడీపీ లోపలే కొంత విమర్శా స్వరం వినిపించేది. నాయకత్వంపై అనుమానాలు, ప్రజల వద్ద సరైన గుర్తింపు లేదన్న వ్యాఖ్యలు ఎక్కువగా వచ్చాయి. అయితే ఈ మధ్య కాలంలో లోకేష్ తన శ్రమ, ప్రజలతో సన్నిహిత సంబంధం ద్వారా ఈ అపనమ్మకాలను తుడిచిపెట్టేశారనే అభిప్రాయం వినిపిస్తోంది. ప్రత్యేకించి యువతలో లోకేష్‌కు బలం పెరుగుతోంది.

మహానాడు వేదికగా లోకేష్‌కు బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ భారీగా వినిపించినా చంద్రబాబు ఇంకా సమయం లేదన్న అభిప్రాయంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. పార్టీలో అందరి అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకోవాలన్నది చంద్రబాబు వ్యూహం. కుటుంబం నుండి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవు. పైగా లోకేష్‌ చుట్టూ ఇప్పటికే ఓ నూతన టీమ్ సిద్ధమవుతోంది.

ఈ పరిణామాల మధ్య చంద్రబాబు వ్యాఖ్యలు లోకేష్‌కు పార్టీపై మరింత స్పష్టమైన భవిష్యత్ దిశను చూపుతున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. త్వరలో టీడీపీలో కీలక మార్పులు జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories