కొన్ని మంచి వీడియోలను మనం మిస్ అవుతున్నాం.. చంద్రబాబు అంతర్జాతీయ, జాతీయ మీడియా ముందరకు వెళ్లినప్పుడు ఆయనఇంగ్లీష్ మాట్లాడడ లేక తడబడిన వైనాలు ఎన్నో.. గతంలో లోకేష్ బాబు ఇలానే తడబడితే నెటిజన్లు పండుగ చేసుకున్నారు. ట్రోల్స్ తో హోరెత్తించారు. ఇప్పుడు చంద్రబాబు వంతు వచ్చింది.
ఇంగ్లీష్ మాట్లాడడంలో తడబాటుతో చంద్రబాబు నవ్వుల పాలవుతున్నారు. తాజాగా దావోస్ సదస్సులోనూ ఇలనే అభాసుపాలయ్యారని సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా ప్రశ్నలు అర్థం కాక ఏపీ సీఎం చంద్రబాబు సమాధానాలు వేరే చెప్పిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
ఈ వీడియో ఇప్పటిదో పాతదో కానీ చంద్రబాబు మాత్రం అడ్డంగా బుక్కయ్యారు.. ‘ముఖ్యమంత్రిగా మీ రెస్పాన్స్ బిలిటీ ఏమిటని జర్నలిస్ట్ చంద్రబాబును ప్రశ్నించగా ఆయన సమాధానం విని అంతా షాక్ అయ్యారు.
మీ కర్తవ్యమేంటని ప్రశ్న అడిగితే.. తనకు ముఖ్యమంత్రిగా రెస్పాన్స్ బాగా వస్తోందని చంద్రబాబు అన్న వీడియో వైరల్ అవుతోంది. బ్లూమ్ బర్గ్ లాంటి పెద్ద సంస్థ చేసిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది. మీరూ చూసి ఎంజాయ్ చేయండి.