సామాజిక మాధ్యమాల్లో పవర్ రేంజర్ పేరుతో గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ను ఏకపారేస్తున్న యువకుడు సంబంధించిన మరో వీడియో విడుదలైంది. ఈ వీడియోలో మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క గట్టిగానే వాయించేసాడు. ఈసారి ఎన్నికలకు ముందు పవన్ చేసిన మాటలు.. ఇప్పుడు అవకాశవాదంతో చేస్తున్న పనులపై సదరు యువకుడు పవన్ కళ్యాణ్ ను ఒక రేంజ్ లో ఆడుకున్నాడు.
అమలాపురం ఆన్సర్ల అప్పారావును అంటూ పవన్ పై పడిపోయాడు. ‘అవకాశవాది ’ అంటే ఎవరు అన్న దానికి డిఫెనేషన్ ఇచ్చాడు. పవన్ అవకాశవాదం తీరును ఎండగట్టారు. ఆనాడు ఆకాశం ఎవరికి వంగి సలాం కొట్టదు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కుర్చీ కోసం సెంట్రల్ సర్కార్ కాళ్లకు మొక్కుతున్న పవన్ తీరును కడిగేశాడు. దీన్నే అవకాశవాదం అంటారండీ అని విమర్శించాడు. తుఫాన్ చిత్తం అంటూ ఎవరికీ తలవంచదు అంటూ తుత్తర మాటలు చెప్పి ఒకప్పుడు తిట్టినవారితోనే పొత్తులు పెట్టుకొని పోటీచేశాడు కదా దీన్నే అవకాశవాదం అంటారండీ.. కుల ప్రస్తావన లేని రాజకీయాలు చేస్తానని మొదట అని.. తర్వాత తన కులాన్ని చూసి ఓటేయమనడం అవకాశం వాదం కాక మరంటి అంటూ నిలదీశాడు.
ఆడబిడ్డల జోలికొస్తే అంతుచూస్తానని ప్రతిపక్షంలో చెప్పి అధికారంలోకి వచ్చాక అఘాయిత్యాలపై మాట మార్చి బెత్తం దెబ్బలతో కొట్టాలంటూ సన్నాయి నొక్కులు నొక్కడాన్ని అవకాశవాదం అంటారని ఏసేసుకున్నాడు. తమ అవకాశాల కోసం అవతరాలు మార్చడాన్నే అవకాశవాదం అంటారని.. పవన్ అలా కనిపిస్తున్నారంటూ బాగానే సెటైర్లతో విరుచుకుపడ్డాడు. ఇప్పుడా వీడియోను మీరూ చూసి కామెంట్ చేయండి..