గోదావరి యాస కుర్రాడు మళ్లీ వచ్చేశాడండీ.. ఆయ్.. ఈసారి బాబు పాలనలోతులను ప్రశ్నిస్తూ రంగంలోకి దిగేసి టీడీపీని కాస్త గట్టిగానే ప్రశ్నించాడండీ.. ఈ యాసకు టీడీపీ బరెస్ట్ కాలేదంటే నమ్మండీ.. ఔనండీ బాబు గారి భోజనాల ఖర్చుపై పలికిన పలుకులు చూస్తుంటే పంచ్ ఫలక్ నామాకే పంచ్ లా ఉందండీ బాబూ..
కామన్ మ్యాన్ కాంతారావు అంటూ బయటకొచ్చిన గోదావరి కుర్రాడు.. ‘మొన్న జరిగిన కలెక్టర్ల మీటింగ్ ఒక్కరోజు భోజనాల ఖర్చు రూ.1.2 కోట్లు అయ్యిందంట.. ఆకుల్లో తిన్నారా? లేక అంతరిక్షంలో కూర్చొని తిన్నారా?’ అంటూ బాబు పాలనలో దోపిడీని కడిగిపారేశాడు.
పేదరికం లేని రాష్ట్రం నిర్మిస్తానని.. పేదలు కడుతున్న డబ్బుతో పంచభక్షాలు భుజించడం ఏంటని ప్రశ్నించాడు. ఎన్నికల ముందర అడ్డగోలు హామీలిచ్చి ఖజానా ఖాళీ అంటూ పథకాలు అమలు చేయకుండా చేతులెత్తేసిన బాబు గారు ఇప్పుడు ఇన్ని డబ్బులు భోజనాలకే ఖర్చు చేయడం ఏంటని కాస్త గట్టిగానే నిలదీశాడు.
ఇలా పెద్దాయన విజన్ ను ప్రపంచంలో ప్రతీ టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యేదాకా మా పోరాటం ఆగదు అంటూ బాబు గారి పథకాలపై ప్రశ్నించిన ఈ యువకుడి వీడియో వైరల్ అవుతోంది. మీరూ సూసేసి ఎంజాయ్ చేయండే..!