Top Stories

బాబు దాచేసిన ఏపీ అప్పుల కథ

చంద్రబాబు చేస్తే సంసారం.. జగన్ చేస్తే వ్యభిచారం.. పచ్చ మీడియా పిచ్చి ప్రచారంతో ఏపీ అప్పుల కథ మరోసారి పతాక శీర్షిక అయ్యింది.జగన్ పెద్దగా అప్పులు చేయలేదని పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రియే లెక్కలు చెబుతుంటే పచ్చమీడియాతో కలిసి చంద్రబాబు మాత్రం 16లక్షల కోట్ల అప్పులు చేశాడు.. మా దగ్గర డబ్బులు లేకపోవడానికి కారణం జగన్ అంటూ ఏడ్చేస్తున్నారు.

చంద్ర‌బాబు ప్ర‌భుత్వ అప్పుల్ని జ‌గ‌న్ అనుకూల మీడియా ప్ర‌ముఖంగా ప్ర‌చురిస్తోంది. చంద్ర‌బాబు అనుకూల మీడియా మాత్రం ఎవ‌రికీ క‌నిపించ‌కూడ‌ద‌నే తాప‌త్ర‌యంతో ఎక్క‌డో ఒక‌మూల రెండు ముక్క‌ల్లో రాసి మ‌మ అనిపిస్తోంది. తాజాగా రూ.5,200 కోట్ల అప్పున‌కు ప్ర‌భుత్వం గ్యారెంటీ ఇస్తూ కేబినెట్ తీర్మానించిన వార్త‌ను వైసీపీ మీడియా ప‌తాక శీర్షిక‌తో ప్ర‌చురించింది.

ఇదే చంద్ర‌బాబు మీడియా విష‌యానికి వ‌స్తే, ప్రాధాన్యం వేరే. అస‌లు అప్పు అనేది పెద్ద అంశ‌మే కాద‌న్న‌ట్టు, లోప‌లి పేజీల్లో ఎక్క‌డో ఓ మూల క‌నిపించీ, క‌నిపించ‌న‌ట్టు ప్ర‌చురించ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. పాల‌కులు త‌మ‌కు ఇష్ట‌మైనోళ్లు అయితే ఒక లెక్క‌, కానివారైతే మ‌రో లెక్క అన్న‌ట్టుగా ఏపీ మీడియా వైఖ‌రి వుంది. అయితే ఇవ‌న్నీ ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్నారు.

ప్ర‌భుత్వం మారిన నేప‌థ్యంలో ఏపీలో అప్పుల‌పై మీడియా దాగుడుమూత‌లు ఆడుతోంది. జ‌గ‌న్ స‌ర్కార్ ఉన్నంత వ‌ర‌కూ రాష్ట్రం అప్పులు లేనిదే పూట గ‌డ‌వ‌దంటూ పెద్ద ఎత్తున టీడీపీ అనుకూల మీడియా ప్ర‌చారం చేసింది. జ‌గ‌న్ స‌ర్కార్ భారీగా అప్పులు చేస్తుండ‌డం వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజం శ్రీ‌లంక‌, వెనుజులా దేశాల స‌ర‌స‌న చేరుతోంద‌నే భ‌యాన్ని క్రియేట్ చేయ‌డంలో టీడీపీ అనుకూల మీడియా త‌ల‌మున‌క‌లైంది.

జ‌గ‌న్ పెద్ద మొత్తంలో సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌లు చేయ‌డం వ‌ల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్ప‌డింద‌ని ఆ మీడియా త‌మ‌కు అనుకూలురైన ప్ర‌ముఖుల‌తో ఇంట‌ర్వ్యూలు ఇప్పించింది. సీన్ క‌ట్ చేస్తే… ఎన్నిక‌ల్లో కూట‌మి విజ‌యం సాధించింది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్ కంటే తాము ఎక్కువ‌గా సంక్షేమ ప‌థ‌కాల‌న్ని అందిస్తామ‌ని చంద్ర‌బాబు న‌మ్మ‌బ‌లికారు. ఆయ‌న్ను జ‌నం న‌మ్మారు. అయితే జ‌గ‌న్ కంటే ఎక్కువ‌గా సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌లు చేయ‌డానికి డ‌బ్బు ఎక్క‌డి నుంచి తెస్తావ‌నే ప్ర‌శ్న‌కు.. త‌న‌కు రాజ‌కీయ‌, ప‌రిపాల‌నానుభ‌వం వుందని, సంప‌ద సృష్టిస్తాన‌ని భారీ డైలాగ్‌లు కొట్టారు.

చంద్ర‌బాబు సంప‌ద సృష్టించే సంగ‌తి దేవుడెరుగు! ప్ర‌తినెలా అప్పులు లేనిదే, స‌ర్కార్ బండి ముందుకు న‌డ‌వ‌ని ద‌య‌నీయ స్థితి. దీన్ని త‌ప్పు ప‌ట్టాల్సిన ప‌నిలేదు. ఇది త‌ప్ప‌ని స‌రి. అయితే చంద్ర‌బాబు స‌ర్కార్ తీసుకొచ్చే అప్పుల్ని ఆయ‌న అనుకూల మీడియా దాచి పెడుతోంది. ఒక‌ప్పుడు జ‌గ‌న్ స‌ర్కార్ అప్పు తెస్తే, ఫ‌స్ట్ పేజీలో ప్ర‌ముఖంగా ఆ మీడియా ప్ర‌చురించేది. అప్పుడు జ‌గ‌న్ మీడియా అప్పుల్ని దాచి పెట్టేది. ఇప్పుడు సీన్ రివ‌ర్స్‌.

Trending today

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

Topics

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

అమరావతి కోసం కదిలిన జగన్..!

అమరావతి అంశంపై గత ఐదేళ్లుగా మౌనంగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి...

‘మహా’ వంశీ అమరావతి లొల్లి

అమరావతి రాజధాని పనులపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. అభివృద్ధి ఎక్కడ...

కుప్పం ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిందే..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పేరుతో జరుగుతున్న భూ దోపిడీని వైఎస్సార్ కాంగ్రెస్...

Related Articles

Popular Categories