పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కానీ తాజాగా విడుదలైన ఆయన కొత్త సినిమా మాత్రం ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచినట్టు కనిపిస్తోంది.
థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు, ప్రత్యేకంగా పవన్ ఫ్యాన్స్‌నే, షాక్‌కి గురయ్యారు. “ఇందులో ఏముంది రా? కత్తులు, తుపాకులు, చంపుకోవడాలు తప్ప ఇంకేమీ లేవు” అంటూ కొంతమంది అభిమానులు థియేటర్ లోపలే బహిరంగంగా విమర్శలు చేశారు.
సోషల్ మీడియాలో ఇప్పటికే ఫ్యాన్స్ రియాక్షన్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. చాలామంది పవన్ సినిమాకు మద్దతు ఇస్తూ తట్టుకునే ప్రయత్నం చేసినా, కొందరు మాత్రం “ఇది అసలు సినిమా కాదు, అర్థమయ్యే స్టోరీ కూడా లేదు” అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఫ్యాన్స్ నేరుగా థియేటర్ లోనే సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేయడం చాలా అరుదైన విషయం. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియోలు విపరీతంగా షేర్ అవుతున్నాయి.
సినిమా మీద ఇంత నెగటివ్ రియాక్షన్ రావడంతో, పరిశ్రమ వర్గాల్లో కూడా చర్చ మొదలైంది. పవన్ ఇమేజ్‌కు ఇది ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.