టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలసి జగన్ పై చేసిన తప్పుడు ఆరోపణలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పంచాయతీ భవనాలకు రంగులు వేసేందుకు జగన్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ఇద్దరు నేతలు ఎన్నికల ముందు విపరీతమైన దుష్ప్రచారం చేశారు.
ఎన్నికల వేదికలపై “జగన్ మూడు వేల కోట్ల రూపాయలు పంచాయతీ భవనాల రంగులకే ఖర్చు చేశాడు” అని గగ్గోలు పెట్టిన ఈ నేతలు, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఎన్ని మాటలైనా చెప్పారని ఇప్పుడు తేలిపోయింది.
తాజాగా అసెంబ్లీలోనే నిజం బయటపడింది. డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టంగా ప్రకటించారు — జగన్ గారి ఐదేళ్ల పాలనలో పంచాయతీ భవనాలకు రంగులు వేయడానికి మొత్తం రూ.101 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయని.
అంటే, చంద్రబాబు–పవన్ కల్యాణ్ కలసి చెప్పిన “మూడు వేల కోట్లు” అనే మాట పూర్తిగా అసత్యం. ఎన్నికల లాభం కోసం ఉద్దేశపూర్వకంగా ప్రజలను మోసగించడమే తప్ప వాస్తవం కాదు.
జగన్ ప్రభుత్వం పంచాయతీ అభివృద్ధికి, గ్రామీణ మౌలిక వసతుల బలోపేతానికి పారదర్శకంగా నిధులను వినియోగించిందని ఈ లెక్కలు మరోసారి నిరూపిస్తున్నాయి.
కూటమి నేతల మాటలు ఇప్పుడు పేలని “తుస్సు బాంబులు”గా మారి ప్రజల ముందే కూలిపోయాయి. నిజం ఎప్పుడూ నిలబడుతుందనే విషయం మరోసారి రుజువైంది.