విజయవాడ రాజకీయాల్లో మళ్లీ వేడి చెలరేగింది. ఎంపీ కేశినేని చిన్ని మరియు మాజీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరాయి. కొలికపూడి సంచలనంగా మాట్లాడుతూ, “కేశినేని చిన్ని కార్యాలయంలో కొడాలి నాని అనుచరుడు దందాలు నడుపుతున్నాడు” అని ఆరోపించారు.
అలాగే కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ మనుషులు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం మాఫియా నడిపిస్తున్నారని కూడా కొలికపూడి తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఆరోపణలతో కూటమిలో అంతర్గత అసంతృప్తి బహిర్గతమవుతోంది.
ఇక చిన్ని మాత్రం ఈ వ్యాఖ్యలను తిరస్కరిస్తూ, “కొలికపూడి వ్యక్తిగత కారణాలతో ఆరోపణలు చేస్తున్నారు” అన్నారు. అయితే ఈ వివాదం కూటమికి కొత్త తలనొప్పిగా మారింది. వైసీపీ అనుచరుల ప్రభావం కూటమిలో ఉందా? అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


