మొన్నటివరకు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. కొందరు మంత్రులైతే లోకేష్ కాబోయే సీఎం అంటూ గళమెత్తారు. అయితే ఇప్పుడు మన చినబాబు సీఎం దగ్గరే ఆగిపోవడం ఏంటి..? మావోడు పీఎం కావాలని ‘గంటా’ కొట్టేశాడు గంటా శ్రీనివాసరావు కొడుకు గంటా రవితేజ.. ఏకంగా పీఎంగా లోకేష్ ను చూడాలని టీడీపీ శ్రేణులు ఆయన పరువు తీస్తున్నాయి.
లోకేష్ పరువు తీస్తున్న టీడీపీ వాళ్ళు మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నారా లోకేష్ పీఎం ఎందుకు అవ్వకూడదు? అని వారు ప్రశ్నిస్తున్నారు..
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కొడుకు గంటా రవితేజ సంచలన కామెంట్స్ చేశారు. ‘‘అందరు డిప్యూటీ సీఎం అంటున్నారు.. పీవీ నరసింహరావు లాగా మా లోకేష్ అన్నయ్య ప్రధాని ఎందుకు అవ్వకూడదు? ఆయనను పీఎంగా ఏదో ఒక రోజు చూడాలనేది మా కోరిక’అంటూ బాంబు పేల్చాడు.
పీఎం కావడం అన్నది 40 ఇయర్స్ పాలిటిక్స్ అయిన మన చంద్రబాబుతోనే కాలేదు. ఇప్పుడు ఆయన కుమారుడు మొన్నటివరకు ఎమ్మెల్యేగానే గెలవలేకపోయిన లోకేష్ వల్ల అవుతుందా? ఏదో తండ్రి ప్రోద్బలంతో గెలిచి మంత్రి పదవి కొట్టేసిన లోకేష్ ను పీఎంగా చూడాలన్న టీడీపీ శ్రేణుల కోరిక నవ్వుల పాలవుతోంది. మీరూ గంటా రవితేజ కామెంట్స్ వీడియో చూసి మీ అభిప్రాయం చెప్పండి.