తెలంగాణ – ఆంధ్ర రాజకీయాల్లో మీడియా యాంకర్ల ఎలివేషన్స్, సపోర్ట్ వ్యాఖ్యలు తరచూ హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా మహా టీవీ యాంకర్ మహా వంశీ ఇచ్చిన ఎలివేషన్స్ నెటిజన్లను ఫుల్‌గా ఎంటర్టైన్ చేస్తున్నాయి.
లోకేష్‌పై ఘన కీర్తనలు
నేపాల్‌లో జరిగిన అల్లర్ల సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను సురక్షితంగా రప్పించడంలో టీడీపీ నేత నారా లోకేష్ పాత్ర ఉందని మహా వంశీ ఘనంగా ఎలివేట్ చేశారు. “నేపాల్ నుంచి ప్రాణాలతో తీసుకొచ్చినందుకు అక్కడి ప్రజలు లోకేష్‌ను నెత్తిన పెట్టుకున్నారు” అన్న వ్యాఖ్యలతో ఆయన చేసిన ఎలివేషన్స్ నెటిజన్లకు పెద్ద ఎంటర్టైన్‌మెంట్‌గా మారాయి.
ఇకముందు పవన్ కల్యాణ్‌పై ఘాటైన విమర్శలు చేసిన వంశీ, ఇప్పుడు టీడీపీ, లోకేష్, చంద్రబాబు జపం చేస్తూ మారిపోయిన తీరు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఒక్కసారిగా టోన్ మార్చేసిన వంశీపై నెటిజన్లు “ఎలివేషన్ యాంకర్”, “మహా మెగాఫోన్”, “ప్రచారకర్త” అంటూ సెటైర్లు చేస్తున్నారు.
వంశీ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో మీమ్స్ హోరెత్తుతున్నాయి. లోకేష్‌ను నేపాల్ హీరోగా చూపించిన పోస్టర్లు, ఫన్నీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు పవన్‌పై ఫైర్ చేసిన వంశీ, ఇప్పుడు టీడీపీ కోసం బాణాలు వదులుతున్న తీరు నెటిజన్లకు కొత్త ట్రోలింగ్ మసాలా అందించింది.
యాంకర్‌గా పేరుపొందిన మహా వంశీ రాజకీయ నాయకులపై చేసిన ఎలివేషన్స్, అతిశయోక్తులు ఒకవైపు టీడీపీ అభిమానులను రంజింపజేస్తుంటే.. మరోవైపు సోషల్ మీడియాలో మీమర్లకు పెద్ద ఎంటర్టైన్‌మెంట్‌ను అందిస్తున్నాయి.