Top Stories

‘మహా’ వంశీ యెల్లో ఎలివేషన్స్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు కూడా గడవకముందే… చంద్రబాబుకు ఎలివేషన్స్ విషయంలో టీడీపీ అనుకూల మీడియా తిరుగులేని వేగం చూపిస్తోంది. ముఖ్యంగా మహా టీవీ అయితే రోజూ కొత్త కొత్త స్క్రిప్ట్‌లతో బాబు ఇమేజ్‌ను మేకప్ చేస్తూనే ఉంది. అందులోనూ ఆ చానల్‌లో ప్రసారమయ్యే వంశీ ప్రోగ్రామ్ ఇప్పుడు “జాకీ షో”గా మారిపోయిందని సోషల్ మీడియాలో వ్యంగ్యాలు వెల్లువెత్తుతున్నాయి.

ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ సమావేశం సాదాసీదా అధికారికమైనదే. అయితే మహా వంశీ దానికి “సినిమాటిక్” టచ్‌ ఇచ్చేశాడు.
అదీ ఇలా “బాబుగారు ఢిల్లీలో ఉన్నారని తెలిసి పీఎం మోదీ ముందుగానే కాల్ చేశారు. ‘హై’ మెసేజ్ పంపారు.. వెంటనే బాబు కూడా ‘Hi PM’ అంటూ రిప్లై ఇచ్చారు. దాంతోనే మోదీ స్వయంగా సమయం ఇచ్చి కలిశారు!”

ఇదంతా వంశీ నేరేషన్‌లో వినిపించగా ప్రేక్షకులు ఒక్కసారిగా “ఇది వార్తా కార్యక్రమమా లేక ప్రమోషన్ షోనా?” అని అనుమానపడ్డారు.

అంతేకాదు, సమావేశానికి కారణంగా “A అంటే అమరావతి” అని వంశీ చెప్పిన తీరు మరింత ట్రోలింగ్‌కి కారణమైంది. “ఢిల్లీ పర్యటనలో అమరావతి ప్రస్తావన వచ్చినా, అది ప్రత్యేకంగా ఏదైనా ప్రాజెక్టు క్లియర్ అయ్యిందని అర్థమా?” అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. కానీ వంశీ నేరేషన్‌లో అయితే బాబు పీఎం ముందుకి వెళ్లగానే “అమరావతి గ్రీన్ సిటీ మోడల్” చర్చలన్నీ పూర్తయ్యిపోయినట్లుగా చూపించారు.

ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు #JockeyVamsi, #HiMessageSaga అనే హ్యాష్‌ట్యాగ్‌లతో ఫన్నీ మీమ్స్ వేస్తున్నారు. ఒకరు రాసినట్లు “వంశీ ఎక్కడ ఉంటే అక్కడే ఎలివేషన్ ఉంటుంది. ఏ వార్తలోనైనా ‘బాబు’ అనే పదం ఉంటే చాలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా గర్జిస్తుంది!”

మొత్తానికి టీడీపీ అనుకూల మీడియా మళ్ళీ తన పాత తీరులోకి వచ్చేసిందని స్పష్టమవుతోంది. ప్రజా సమస్యలకన్నా నాయకుడి ఎలివేషన్, ‘ఇమేజ్ బిల్డింగ్’ పై ఎక్కువ దృష్టి. అదే ఈ మధ్య మహా వంశీ ప్రోగ్రామ్‌లలో స్పష్టంగా కనిపిస్తోంది..

జాకీలు పెట్టి లేపే “యెల్లో ఎలివేషన్స్” షో!

https://x.com/Samotimes2026/status/1978486122461450720

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories