తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మాహా టీవీ యాంకర్ మహా వంశీ తనదైన శైలిలో జాకీలతో బాబుపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.
హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ, తర్వాత అమరావతి నిర్మాణానికి ఆయన చూపిన దిశను కొనియాడుతూ వంశీ ప్రశంసలు కురిపించారు. “హైదరాబాద్‌ను లేపాడు… అమరావతిని నిర్మించబోతున్నాడు… ఏపీని మరో స్థాయికి తీసుకెళ్తాడు” అంటూ బాబుకు తన అభిమానాన్ని చాటుకున్నారు.
ఇదే సందర్భంలో చంద్రబాబును “మిషన్ లాంటి వాడే, కానీ మిషన్ కంటే గొప్పోడు” అని పోల్చుతూ వంశీ ఘనతలు చెప్పారు. 75 ఏళ్ల వయసులోనూ ఎటువంటి సమస్యలు రాకుండా, దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు 30 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లు, చేసిన కృషి, సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ వంశీ జాకీలు కొడుతూ అభిమానాన్ని ఉట్టిపడేలా చేశారు.
మొత్తానికి మహా వంశీ జాకీలతో చంద్రబాబు రాజకీయ ప్రయాణానికి ప్రత్యేక శోభ చేకూర్చారు.
చంద్రబాబు ను ఈ రేంజ్ లో జాకీలు పెట్టి లేపడంతో ఆయన మాటలు సోషల్ మీడియాలో ట్రోల్స్ మెటీరియల్ అయిపోయాయి..ట్రోల్స్, మీమ్స్ చేస్తూ హోరెత్తిస్తున్నారు.