ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల ఒక కార్యక్రమంలో లోకేష్, “పిల్లలను చూసినప్పుడు నాకు దేవుడితో సమానం” అని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి.
వైసీపీ నేతలు లోకేష్‌పై విమర్శలకు ప్రధాన కారణంగా బెండపూడి విద్యార్థుల ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు. జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదివి, ప్రతిభ చూపిన బెండపూడి పిల్లలపై అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు విపరీతమైన ట్రోలింగ్‌కు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది.
“జగన్ గారిపై ద్వేషంతో, పిల్లలు అని కూడా చూడకుండా వ్యక్తిగతంగా దాడి చేసి, వారిని అపహాస్యం చేశారు” అని వైసీపీ మండిపడుతోంది.
నాడు రాజకీయ ప్రయోజనాల కోసం పిల్లలను సైతం వదలకుండా ట్రోల్ చేసిన టీడీపీ, ఇప్పుడు లోకేష్ “పిల్లల్లో దేవుళ్లు కనిపిస్తున్నారని” చెప్పడంపై వైసీపీ ‘ద్వంద్వ వైఖరి’ అంటూ విమర్శలు చేస్తోంది.
ఈ అంశంపై సోషల్ మీడియాలో “ఈ నీతులు నాడు ఏమైయ్యాయి?” అంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తున్నాయి. లోకేష్ వ్యాఖ్యలు కేవలం “రాజకీయ డ్రామా” అని వైసీపీ అభిప్రాయపడుతోంది.
https://x.com/JaganannaCNCTS/status/1992967433364046023?s=20


