ఏమాత్రం రాజకీయ అనుభవం లేకుండా మొదలైన నారా లోకేష్ ప్రయాణం ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే దిశగా సాగుతోంది. ఒకప్పుడు “తెలుగు మాట్లాడలేడు, నాయకత్వం లేదు” అని విమర్శించినవారు ఇప్పుడు ఆయన ధీటైన ప్రదర్శన చూసి నిశ్శబ్దంగా మారారు. రాజకీయాల్లో అనుభవం కంటే క్రమశిక్షణ, నేర్చుకోవాలనే తపన, ప్రజలతో మమేకం కావడం ముఖ్యమని లోకేష్ నిరూపించారు.
వైసీపీ నేతలు చేసిన విమర్శలకూ సమాధానం ఇవ్వడమే కాకుండా, తన మాటతీరు, స్పష్టత, ఆత్మవిశ్వాసంతో ప్రత్యర్థులకు ధీటుగా నిలిచారు. ఇక తాజాగా బీహార్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ పెద్దలు పిలిపించడం ఆయన రాజకీయ ప్రస్థానానికి మరో మైలురాయి. ఆహ్వానం ద్వారా కేంద్ర స్థాయిలో లోకేష్ ప్రాధాన్యం పెరిగిందనే సంకేతం స్పష్టంగా కనిపిస్తోంది.
ఒకప్పుడు చంద్రబాబు నీడలో ఉన్నట్లు కనిపించిన లోకేష్, ఇప్పుడు ఆయనకే సపోర్ట్ సిస్టమ్‌గా మారారు. బీజేపీతో టిడిపీ సంబంధాలు బలపడుతున్న ఈ సమయంలో, లోకేష్ పాత్ర కీలకమైంది. అభివృద్ధి, పరిపాలన, యువ నాయకత్వం – ఈ మూడు అంశాల్లోనూ తన ముద్ర వేసిన నారా లోకేష్ ఇప్పుడు ఆంధ్రా సరిహద్దులు దాటి జాతీయ రాజకీయాల్లో అడుగుపెడుతున్నారు.
ఇలా చూస్తే లోకేష్‌పై చేసిన విమర్శలన్నీ ఆయన ఎదుగుదలకు మెట్లు అయ్యాయి అనడం తప్పు కాదు.


