రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. కానీ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, సమాచారంతో ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేసినప్పుడు వాటిని ఎదుర్కొంటున్నాడు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్. ప్రస్తుతం అదే బాటలో పయనిస్తున్నారు. తనపై ‘సాక్షి’ పత్రిక ప్రచురించిన నిరాధార కథనాలపై ఆయన రాజీలేని పోరాటం చేస్తున్నారు.
సాధారణంగా రాజకీయ నాయకులు తమపై తప్పుడు వార్తలు వచ్చినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖండించి వదిలేస్తుంటారు. కానీ లోకేష్ ప్రతీకారంతో రగిలిపోతున్నాడు. నన్నే అంటావా? అని మీడియాపై ఫైట్ కు దిగాడు.. తనపై వచ్చిన ప్రతి అసత్య ఆరోపణను న్యాయస్థానం వేదికగా సవాల్ చేస్తున్నారు. విశాఖపట్నంలోని జిల్లా కోర్టుకు ఆయన క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. ఎన్ని ఏళ్లు గడిచినా, ఎన్ని పనులున్నా న్యాయ పోరాటాన్ని మాత్రం విస్మరించడం లేదు. అసత్య ప్రచారాలకు ముగింపు పలకాలంటే శిక్ష పడాల్సిందేనన్న పట్టుదలతో ఆయన ముందుకు సాగుతున్నారు.
కేవలం మాటలతో సరిపెట్టకుండా, న్యాయస్థానంలో వాస్తవాలను నిరూపించేందుకు లోకేష్ ప్రతీకార వాంచతో కోర్టుకు ఎక్కడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. . నిజం నిలకడ మీద తెలుస్తుందనే నమ్మకం లోకేష్ గమనించాలి. ఇలానే చేస్తే వచ్చేది వైసీపీ ప్రభుత్వం.. అప్పుడు లోకేష్ కు దబిడదిబిడే..


