Top Stories

కూటమికి ఏడాది : ఏం సాధించారు?

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి (జూన్ 4) ఏడాది పూర్తయింది. గత ఏడాది ఇదే రోజున వెలువడిన ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించి, 164 అసెంబ్లీ స్థానాలతో తిరుగులేని మెజారిటీని సొంతం చేసుకుంది. ‘వై నాట్ 175’ నినాదంతో బరిలోకి దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురవగా, జూన్ 12న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో 24 మంది మంత్రులతో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. క్యాబినెట్‌లో ఒక మంత్రి పదవి ఇంకా ఖాళీగానే ఉంది.

-పాలనాపరమైన సవాళ్లు

అయితే, పాలనాపరమైన విధానాలు, నిర్ణయాలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం వెనుకబడింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల హామీలైన సూపర్ 6 పథకాలు ఏడాది పూర్తయినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు. దీంతో ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు, అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు వేల కోట్లు కేటాయిస్తూ, ప్రజలకు అత్యవసరమైన సంక్షేమం, అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది కాలంగా నిధుల సమీకరణపై దృష్టి పెట్టి, అభివృద్ధి పనులను పక్కన పెట్టారనే ఆరోపణలున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కూడా నిధులు తెచ్చి పూర్తి చేయలేకపోవడం గమనార్హం.

గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తి చెందగా, ఇప్పుడు పథకాలు అందకపోవడంతో ప్రజలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులు మందకొడిగా సాగుతున్నాయి.

-రాజకీయ సమీకరణాలు

అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం అమరావతి, పోలవరం ప్రాజెక్టులతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించింది. దీంతో సంక్షేమ పథకాల విషయంలో కొద్ది రోజుల పాటు వేచి చూద్దామనే ధోరణి ప్రజల్లో కనిపించినా, ప్రభుత్వ చర్యలపై వ్యతిరేకత కూడా మొదలైంది. అయితే, రాజకీయపరంగా ప్రతిపక్షం అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్లకపోవడం కూటమికి కలిసొచ్చింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా అందడంతో తటస్తులు, మేధావులు, విద్యాధికులు గత ఐదేళ్ల పరిస్థితిని గుర్తుచేసుకొని, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారు.

కూటమి పాలన రెండో ఏడాదిలోకి అడుగుపెట్టడంతో సంక్షేమ పథకాల అమలుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఇది ప్రజల్లో మరింత వ్యతిరేకతను పెంచుతుందేమోనని కూటమి సర్కార్ ఆందోళన చెందుతోంది. రాబోయే కాలంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Trending today

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

Topics

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

Related Articles

Popular Categories