ఏపీలో తాజాగా ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను తొలగిస్తున్న ఘటనలు బయటపడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో పవన్‌కు కీలక గౌరవం దక్కుతుండగా.. కొన్ని చోట్ల ఆయన ఫోటోలు లేకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా కార్యాలయాల్లో ప్రధాని, సీఎం ఫోటోలు మాత్రమే ఉండగా.. సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఫోటోను ఉంచాలని ఆదేశించారు. కూటమి విజయానికి పవన్ చేస్తున్న కృషిని గుర్తించి, ఈ నిర్ణయం తీసుకున్నారు. గత డిప్యూటీ సీఎంలకు లేని గౌరవం పవన్‌కు దక్కింది.
అయితే కొంతమంది అధికారులు కోర్టు ఆదేశాలు, పిటిషన్ అనే పేరుతో ఈ ఫోటోలను తీసివేస్తున్నారు. గతంలో దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించినా, ఈ చర్యలు కొనసాగుతుండడం రాజకీయ కలకలం సృష్టిస్తోంది. రాజకీయ కారణాలతో మరొక్కసారి పవన్ ఫోటోను తొలగించారా? అనే సందేహాలు ఉదయిస్తున్నాయి.


