Top Stories

హే పవన్.. ఏంటిది? తిట్టాల్సింది పచ్చ బ్యాచ్ ను కదా పవనూ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎవరు తప్పు చేసినా వైసీపీనే టార్గెట్ గా చేసుకోవడం అలవాటు అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిరోజులుగా జనసేన, టిడిపి నేతలు మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల దారుణంగా కొట్టుకుంటున్నారు కూడా. ఈ వ్యవహారంపై పలువురు జనసేన ముఖ్య నాయకులు వద్దకు తీసుకువెళ్లారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఈ గొడవలు స్పందిస్తూ వైసిపి నేతల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ నాయకులకు యుద్ధమే కావాలంటే కావలసినంత యుద్ధం ఇస్తానంటూ విమర్శలు చేశారు. తమది మంచి ప్రభుత్వమే కానీ చేతకాని ప్రభుత్వం కాదంటూ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ మాటలను చూసిన ఎంతో మంది ఇదెక్కడి చోద్యం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

అధికారం కోసం కూటమి నాయకులు తన్నుకుంటే మధ్యలో వైసీపీకి సంబంధం ఏంటి.? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. టిడిపి నాయకులు.. జనసేన నాయకులు, కార్యకర్తలను తిట్టిపోస్తున్నారని, కొన్నిచోట్ల దాడులకు పాల్పడుతున్నారంటూ జనసేన కార్యకర్తలు వాపోతున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పాల్సింది, హెచ్చరించాల్సింది టిడిపి నాయకులకు కదా.. మరి వైసిపిపై పడుతున్నాడు ఏంటి అంటూ జన సైనికులే వ్యాఖ్యానిస్తున్నారు. అంటే ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడంటూ జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధినేతే ఇలా ఉన్నప్పుడు మన పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుంది అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ వైసీపీని లక్ష్యంగా చేసుకుంటూ చేస్తున్న ఈ రాజకీయాలను చూసి కొందరు జనసైనికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెన్నాళ్లుపాటు టిడిపికి ఊడిగం చేస్తాము అంటూ పలువురు ఆవేదన చెందుతున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి అయినా క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలను చూసి గట్టిగా నిలబడి జనసేనను కాపాడుకోండి అంటూ పలువురు సూచిస్తున్నారు.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories