Top Stories

టిడిపికి పవన్ వెన్నుపోటు

ఏపీలో కూటమి పార్టీల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. ఒకవైపు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు గొడవలు పడుతుంటే.. పై స్థాయిలో అగ్ర నాయకుల మధ్య కూడా ఈ పోరు తారాస్థాయికి చేరుకుంటుంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో టిడిపి, జనసేన కార్యకర్తలు, నాయకుల మధ్య గొడవలు జరుగుతుండగా, కొన్నిచోట్ల బాహబాహికి కూడా దిగుతున్నారు. ఈ గొడవలు ఇప్పటికే పలువురు పార్టీ పెద్దలు దృష్టికి తీసుకువెళ్లారు. ఒకవైపు క్షేత్రస్థాయిలో ఉన్న గొడవలను సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్న సమయంలో.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత అగ్గి రాజేసినట్టు అయింది. ఏపీలో జరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతలను పరిరక్షించే విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ఈ విషయంలో హోం మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తానే ఆ శాఖ బాధ్యతలను తీసుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కూటమిలో అగ్గి రాజేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూటమి బంధానికి బీటలు వారేలా చేస్తున్నారంటూ పేర్కొంటున్నారు.

పవన్ కళ్యాణ్ టిడిపికి వెన్నుపోటు పొడుస్తున్నారంటూ ఆ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. కూటమి ధర్మాన్ని పాటించకుండా బహిరంగంగా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఒకరకంగా టిడిపిని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో తాను భాగస్వామిని అన్న విషయాన్ని మర్చిపోయి పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో ఆయనే చెప్పాలంటూ కొలువురు ప్రశ్నిస్తున్నారు. తాజాగా చేసిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు టిడిపికి వెన్నుపోటుగా పలువురు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఎప్పటికే కూటమి ప్రభుత్వం ఆ సమర్ధతతో వ్యవహరిస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ విమర్శలకు బలాన్ని చేకూర్చేలా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయంటూ పలువురు టిడిపి సీనియర్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మనసులో మరో ఆలోచన పెట్టుకొని ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు. దీనిపై టిడిపి నేతలు బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories