చంద్రబాబుపై విరుచుకుపడ్డ ప్రజలు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమలుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన “సూపర్ సిక్స్” పథకాల అమలులో జాప్యం జరుగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచినా వాటికి నిధులు కేటాయించలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత ప్రభుత్వాన్ని అప్పుల పాలయ్యిందని విమర్శించిన చంద్రబాబు, ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని చెప్పడం సరికాదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఎన్నికల సమయంలో కరెంట్ బిల్లుల తగ్గింపు, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు వంటి హామీలు ఇచ్చి, ఇప్పుడు వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని వారు మండిపడుతున్నారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కూటమి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ, “సూపర్ 6” హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.