వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి కారుమూరు ‘పచ్చ’ ముఠాపై, ముఖ్యంగా నిన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ అంశాలపై పచ్చముఠా కుట్రలను బయటపెట్టారు.. జగన్ గారి ప్రెస్ మీట్ తరువాత, ప్రతిపక్ష శిబిరం వ్యక్తిగత విమర్శలతో దుష్ప్రచారం మొదలుపెట్టిందని ఆయన ఆరోపించారు.
“నిన్న జగన్ గారి ప్రెస్ మీట్ మీద వ్యక్తిగత విమర్శలతో పచ్చ ముఠా అంతా దుష్ప్రచారం మొదలు పెట్టింది. జగన్ గారు అడిగిన ప్రశ్నల మీద సమాధానం చెప్పే దమ్ము ఒక్కరికి కూడా లేదు. ఎందుకంటే, వారికి నిజం తెలుసు. అందుకే, విషయం దాచి, వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు,” అని వెంకట్ కారుమూరు గారు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
పచ్చ ముఠా గతంలో చేసిన దుశ్చర్యలను గుర్తు చేస్తూ, ఆయన తీవ్రంగా మండిపడ్డారు. “లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అని తప్పుడు మాటలతో తిరుమల లడ్డూని అపవిత్రం చేసిన వీళ్ళు.. ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఈ నీచమైన కుట్రను ప్రజలు మర్చిపోలేదు,” అని ఆయన ఉద్ఘాటించారు.
టీటీడీ మాజీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల కొండలపై చేసిన వ్యాఖ్యలను కూడా వెంకట్ కారుమూరు తప్పుబట్టారు. “టీటీడీ చైర్మన్ హోదాలో ఉండి బీఆర్ నాయుడు తిరుమల కొండలని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత గల వ్యక్తి ఇలా మాట్లాడటం సిగ్గు చేటు. తిరుమల కొండల విషయంలో పచ్చ ముఠా వైఖరి ఎప్పుడూ ద్వంద్వంగానే ఉంటుంది,” అని వెంకట్ కారుమూరు గారు విమర్శించారు.
పచ్చ ముఠా దుష్ప్రచారం మానుకుని, జగన్ గారు అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
https://x.com/JaganannaCNCTS/status/1996809411021676639?s=20


