పథకాలకు డబ్బుల్లేవు అంటూ చేతులెత్తేసిన ఏపీ సీఎం చంద్రబాబుకు నిరసన సెగ తగులుకుంది. ఇక జనాల్లోకి వస్తే జనాలు వదిలేలా లేరు. తాజాగా రాయచోటిలో ప్రయాణించిన చంద్రబాబుకు గట్టి షాక్ తగిలింది. ఏకంగా సభలోనే ఓ యువకుడు నిలదీసిన పరిస్థితి ఎదురైంది. దీంతో చంద్రబాబు ‘ఏయ్ కూర్చోవయ్యా’ అంటూ దబాయించిన పరిస్థితి నెలకొంది.
రాయచోటి ప్రజావేదిక సభలో చంద్రబాబు నాయుడుకు నిరసన సెగ ఎదురైంది. అన్నమయ్య జిల్లాకు యూనివర్సిటీ ప్రకటించాలని నినాదాలు చేసిన యువకుడిపై మండిపడ్డ చంద్రబాబు నాయుడు ఆ యువకుడు ఆపకపోవడంతో ‘ఇలాంటివి ఇంకా ఎక్కువ అవుతాయి. కొందరు మన సభను చెడగొట్టడానికి రెడీ అవుతున్నారు అంటూ టీడీపీ గుంపును ఎదురించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
చంద్రబాబు ఇటీవలే సూపర్ 6 హామీలపై చేతులెత్తేయడంతో జనంలోనూ అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. అవే ఇప్పుడు రాయచోటి జిల్లాలో ప్రతిధ్వనించాయి. మున్ముందు చంద్రబాబుకు దబిడ దిబిడే అన్నట్టుగా మారడం ఖాయమని.. ఇది ఆరంభం మాత్రమేనని ప్రజలు అంటున్నారు.