Top Stories

సింగయ్యను అంబులెన్స్ లో చంపేశారు..

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఇటీవల మరణించిన సింగయ్య మృతిపై అతని భార్య లూర్దు మేరీ సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తను టీడీపీ నేతలే చంపేశారని ఆరోపించిన ఆమె, ఈ ఘటనలో నారా లోకేష్‌పై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. సింగయ్య చనిపోయిన తర్వాత తమ ఇంటికి 50 మంది నారా లోకేష్ అనుచరులు వచ్చారని, తమను బెదిరించారని ఆమె వెల్లడించారు.

లూర్దు మేరీ తెలిపిన వివరాల ప్రకారం, “సింగయ్య చనిపోయిన తర్వాత నారా లోకేష్ మనుషులు 50 మంది మా ఇంటికి వచ్చారు. తాము చెప్పినట్లు చెప్పాలని బెదిరించారు. మేము కూడా మీ కులస్థులమేనని చెప్పారు. కాగితాలపై ఏదో రాసుకొచ్చి సంతకాలు చేయమన్నారు. సంతకం చేయకపోవడంతో మమ్మల్ని బెదిరించారు.” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసుల పాత్రపైనా ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. “పోలీసులు కూడా వీడియో చూపిస్తూ సంతకాలు చేయమన్నారు. మా మీద రకరకాలుగా ఒత్తిడి చేశారు” అని లూర్దు మేరీ పేర్కొన్నారు.

తన భర్త మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. “నా భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయి. ఆసుపత్రికి తరలించేటప్పుడు అంబులెన్స్‌లో ఏదో జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లనీయలేదు. చిన్న చిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడు? ఏదో చేశారని మాకు అనుమానంగా ఉంది” అని సింగయ్య భార్య లూర్దు మేరీ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ సంచలన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. సింగయ్య మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
వీడియో

https://x.com/TeluguScribe/status/1940352618091487370

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories