Top Stories

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి ప్రశ్నించాడని ఆ ఛానెల్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై టీడీపీ బాయ్‌కాట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. “పక్షపాత జర్నలిజం”, “రాజకీయ దాడి” అంటూ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ టీవీని బహిష్కరించాలన్న నిర్ణయం పార్టీ శ్రేణుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

అయితే ఇప్పుడు అదే అర్నాబ్ గోస్వామిని, టీడీపీకి అనుకూలంగా ప్రసారం చేసే మహా టీవీ న్యూస్ చానెల్ ఎండీ, యాంకర్ మహా వంశీ కలవడం, ఆయనను బహిరంగంగా పొగడటం, సన్మానం చేయడం, అర్నాబ్ చేత మహా టీవీని ప్రశంసింపజేయడం—ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో టీడీపీ బాయ్‌కాట్‌పై నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

“ఒకవైపు బాయ్‌కాట్ అంటారు… మరోవైపు సన్మానం చేస్తారా?” “ఇదేనా మీ రాజకీయ స్థిరత్వం?”
“మీరు చెప్పిన జగన్ బినామీ అర్నాబ్ గోస్వామి ఇతనే కదా?” “అయితే నిన్నటి విమర్శలు నాటకమా?” అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. ముఖ్యంగా ‘అర్నాబ్ జగన్ బినామీ’ అంటూ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, “టాక్‌మ్ మారెళ్ళ వంశీ చౌదరి… ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు?” అని ప్రశ్నిస్తున్నారు.

ఈ వ్యవహారం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. పార్టీ తీసుకున్న బాయ్‌కాట్ నిర్ణయానికి స్పష్టత, ఏకత్వం లేకపోతే ప్రజల్లో తప్పు సందేశం వెళ్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. మీడియా వ్యూహం ఒకటే ఉండాలి—బహిరంగంగా బాయ్‌కాట్ అంటూనే, లోపల పొగడ్తలు, సన్మానాలు అంటే రాజకీయంగా నమ్మకత దెబ్బతింటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇప్పుడు ప్రశ్న ఒక్కటే .. టీడీపీ నిజంగా రిపబ్లిక్ టీవీని బాయ్‌కాట్ చేస్తోందా? లేదా ఇది కేవలం తాత్కాలిక ఆగ్రహమా?

ఈ గందరగోళానికి పార్టీ నాయకత్వం ఎలాంటి స్పష్టత ఇస్తుందో, నెటిజన్ల ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారో చూడాల్సిందే.

https://x.com/Anithareddyatp/status/1999464042143064393?s=20

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories