తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి కూడా ఆదరణ పొందలేకపోతోంది. ఎంతలా అంటే సభ్యత్వం నమోదులో చాలా వెనుకబడింది. అసలు ఎవరూ టీడీపీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో టీడీపీ ప్రభుత్వం దొంగదారిలో సభ్యత్వాలు పూర్తి చేస్తోంది. పథకాలు అమలు చేయాలంటే సభ్యత్వం ఉండాలని అధికారులు, వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఫోన్లు చేస్తూ సభ్యత్వం తీసుకోకుంటే మీకు పథకాలు రావు అంటూ బ్లాక్ మెయిల్ చేస్తోంది. ఈ మేరకు ఆడియో క్లిప్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
‘‘ఏపీ ప్రజల్లారా! పథకం కావాలా.. అయితే టీడీపీ సభ్యత్వం తీసుకోవాలి.. రుణం కావాలా ఐతే టీడీపీ కార్డు తీసుకో.. బీమా కావాలా ? ఐతే మళ్ళీ టీడీపీ సభ్యత్వం ఉండాల్సిందే. ’’ అంటూ టీడీపీ నాయకుల బ్లాక్మెయిలింగ్ సాగుతోంది. సిగ్గులేకుండా ప్రజలని బెదిరిస్తూ సభ్యత్వాలు చేర్చుకుంటున్నారు. టీడీపీ పార్టీ తీరు ప్రజలు మండిపడుతున్నారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా బ్లాక్ మెయిల్ చేయకుండా.. కులం..మతం..చూడకుండా అర్హతను బట్టి పథకాలు ఇచ్చింది.. ప్రతి ఇంటికీ సంక్షేమం పంచింది..అది కదా మనసున్నవారి పాలన అని ప్రజలు అంటున్నారు. టీడీపీ తీరుపై మండిపడుతున్నారు.