Top Stories

టీడీపీ పార్టీలో కమీషన్ల కలకలం

అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ ఎంపీలకే, గుత్తేదారులకే కమిషన్ వేధింపులు తప్పడం లేదన్న ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. అనంతపురం జిల్లా పరిధిలో చోటుచేసుకున్న తాజా ఘటన టీడీపీ శ్రేణుల్లోనే కాకుండా ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

అనంతపురం జిల్లాలో రూ.7 కోట్ల విలువైన పైప్‌లైన్ టెండర్ పనులను టీడీపీ ఎంపీకి సంబంధించిన గుత్తేదారు దక్కించుకున్నాడు. అయితే ఈ పనుల్లో నుంచి 10 శాతం కమిషన్ ఇవ్వాలంటూ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నేరుగా గుత్తేదారికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగినట్లు సమాచారం. మొదట గుత్తేదారు తాను టీడీపీ ఎంపీ మనిషినని చెప్పినా, దానిని లెక్కచేయని ఎమ్మెల్యే తమ్ముడు నేరుగా ఎంపీకే ఫోన్ చేసి కమిషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంతో తీవ్రంగా అసహనానికి గురైన ఎంపీ, ఎమ్మెల్యే తీరుపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఇదే అంశంపై ఎమ్మెల్యే మరింత దబాయింపులకు దిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. “అధిష్టానానికే ఫిర్యాదు చేస్తావా? ఇక్కడ మేమే అధిష్టానం. నాదే రాజ్యం. నన్నెవడు ఏం చేయలేడు” అంటూ ఎమ్మెల్యే బెదిరించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇంతటితో ఆగకుండా, 10 శాతం కమిషన్ ఇవ్వకపోతే పనులకు సంబంధించిన సామాగ్రిని ఎత్తుకుపోతామని కూడా హెచ్చరించినట్లు గుత్తేదారు వర్గాలు చెబుతున్నాయి. అధికార పార్టీ ఎంపీకే స్థానిక ఎమ్మెల్యేల నుంచి ఈ స్థాయి వేధింపులు ఎదురవుతున్నాయంటే, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని విమర్శకులు అంటున్నారు.

అవినీతి రహిత పాలన, పారదర్శకత అని ఎన్నికల సమయంలో నినాదాలు చేసిన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కమిషన్ల రాజకీయాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని చెబుతుంటే, మరోవైపు అధికార పార్టీలోనే నేతల మధ్య కమిషన్ల కోసం పోటీ జరుగుతోందన్న ఆరోపణలు పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి.

ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో, నిజంగా చర్యలు తీసుకుంటుందా? లేక అంతర్గతంగా సర్దిచెప్పి మౌనం పాటిస్తుందా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Trending today

మేడారంలో కుక్కకు తులాభారం.. హీరోయిన్ చెప్పిన సత్యం

మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా తన పెంపుడు కుక్కకు తులాభారం (బంగారం)...

బాబు గారు మళ్లీ మొదలెట్టారు..

ఈరోజు ప్రపంచంలోని 195 దేశాల్లో తెలుగు వారు ఉన్నారంటే దానికి కారణం...

పవన్ కళ్యాణ్ ను ఓడించే జగన్ మాస్టర్ ప్లాన్ ఇదీ

పిఠాపురం నియోజకవర్గం పేరు జాతీయ స్థాయిలో చర్చకు వచ్చినది పవన్ కళ్యాణ్...

వివాహితను శారీరకంగా వాడుకొని వదిలేసిన జనసేన నేత.. ఫొటోలు లీక్

నర్సీపట్నం జనసేన ఇంచార్జిగా వ్యవహరిస్తున్న సూర్యచంద్రపై ఒక వివాహిత మహిళ సంచలన...

ABN రాధాకృష్ణ, NTV చౌదరీలు ఆంబోతులు.. పోల్చిన రేవంత్ రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మీడియా–రాజకీయాల మధ్య వివాదం హాట్ టాపిక్‌గా మారింది....

Topics

మగాళ్లు ఆ పని చేస్తారు… రెచ్చిపోయిన రేణు దేశాయ్

జంతు ప్రేమికురాలిగా, సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు స్పందించే వ్యక్తిగా పేరొందిన రేణు...

tdp mla controversy : టీడీపీ ఎమ్మెల్యే బర్త్ డే.. అమ్మాయిలతో ఇలా ఎంజాయ్

tdp mla controversy : చిత్తూరు జిల్లాకు చెందిన గురజాల జగన్‌మోహన్‌నాయుడు...

నారా బ్రాహ్మణిపై సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు

ఇటీవల ఒక చర్చా కార్యక్రమంలో టీవీ5 యాంకర్ సాంబశివరావు మాట్లాడుతూ నందమూరి...

Related Articles

Popular Categories