Top Stories

రెచ్చిపోయిన టిడిపి ఎమ్మెల్యే.. !

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే వి.ఎం. థామస్ తిరుమలలో హల్ చల్ చేశారు. శనివారం స్వామివారి దర్శనం కోసం తిరుమల వచ్చిన ఆయన, నిబంధనలను ఉల్లంఘించి వీఐపీ బ్రేక్ దర్శనాల విషయంలో టీటీడీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీటీడీ నిబంధనల ప్రకారం, ఎమ్మెల్యే థామస్‌తో పాటు మరో 9 మందికి మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతి ఉంది. అయితే, ఆయన తన వెంట వచ్చిన అదనంగా మరో ఆరుగురిని కూడా ప్రోటోకాల్ లైన్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ఆరుగురికి వేరే రిఫరెన్స్‌లో సాధారణ వీఐపీ బ్రేక్ టిక్కెట్లు ఉన్నప్పటికీ, వారిని కూడా తనతో పాటు ప్రోటోకాల్ లైన్‌లో అనుమతించేందుకు టీటీడీ సిబ్బంది నిరాకరించారు.
దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే థామస్, టీటీడీ సిబ్బందిపై తిట్ల దండకం అందుకున్నారు. సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన అధికారులపై సైతం రుసరుసలాడారు. చివరికి, తన అనుచరులను బలవంతంగా నేరుగా ఆలయంలోకి తీసుకువెళ్లినట్లు సమాచారం. సిబ్బంది సమాచారం ఇవ్వడంతో డిప్యూటీ ఈవో, విజిలెన్స్ అధికారులు అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారిపై కూడా ఎమ్మెల్యే థామస్ విరుచుకుపడినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ వివాదం పెద్దది కాకుండా టీటీడీ అధికారులు పరిస్థితిని చక్కదిద్ది, ఎమ్మెల్యేను అక్కడి నుంచి పంపించారు. అయినప్పటికీ, అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ చర్చనీయాంశమైంది. https://x.com/JaganannaCNCTS/status/1944344610580664470

Trending today

అంబటి రాంబాబుకు బెయిల్ రాకుండా కుట్ర?

మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్‌ తర్వాత ఆయనకు బెయిల్ దక్కుతుందా?...

నాగబాబు ప్రాబ్లం ఏంటి?

జనసేన నేత నాగబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర...

లవర్స్ డేకు హోటళ్లలో భారీ అడ్వాన్స్‌డ్ బుకింగ్స్

వాలెంటైన్స్ డే సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా హోటళ్లలో అడ్వాన్స్‌డ్ బుకింగ్స్ భారీగా...

బీఆర్ఎస్, వైసీపీపై ఏబీఎన్ రాధాకృష్ణ అక్కసు

ఆంధ్రజ్యోతి పత్రికలో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ కొత్తపలుకు పేరిట రాసిన వ్యాఖ్యలు...

అంబటి కోసం కదిలిన కాపు నేతలు.. రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన ఉద్రిక్తత

కాపు సమాజంలో మళ్లీ ఆవేదన ఉప్పొంగుతోంది. విశాఖపట్నం నుంచి భారీ ర్యాలీగా...

Topics

తిరుమల లడ్డూపై రోజా కీలక వ్యాఖ్యలు..

తిరుమల లడ్డు అంశం చుట్టూ రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. 2024లో...

ఏపీలో మహిళా ఎమ్మెల్యేపై క్షుద్ర పూజల కలకలం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన ఘటన వెలుగుచూసింది. లడ్డూ వివాదంతో అధికార–విపక్షాల...

కాపు అబ్బాయిలు వెనుక కుక్కల్లా..

ఏపీలో కుల రాజకీయాల వేడి మరోసారి రాజుకుంది. మాజీ మంత్రి అంబటి...

Related Articles

Popular Categories