ఆంధ్రప్రదేశ్ కూటమి రాజకీయాల్లో కొత్త రకం కలహం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్యే వివాదాలు ముదిరితే, తాజాగా మహిళా విభాగాల మధ్య కూడా ఘర్షణ మొదలైంది.
టీడీపీ అనుబంధ విభాగం తెలుగు మహిళ, జనసేన మహిళా విభాగం వీర మహిళ సోషల్ మీడియాలో తలపడటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అసెంబ్లీ అనంతరం జరిగిన కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుర్చీల వ్యవహారం వివాదానికి దారి తీసింది. “విత్ బెయిల్ – వితౌట్ బెయిల్” అంటూ వీర మహిళా నాయకురాలి పోస్ట్‌తో రచ్చ మొదలైంది. దీనికి ప్రతిస్పందనగా తెలుగు మహిళ నాయకురాలు అనూష ఉండవల్లి కౌంటర్ ఇచ్చి మరోసారి దుమారం రేపారు.
“బెయిల్ పక్షుల కూతలకు లొంగం” అంటూ వీర మహిళ కూడా వెనక్కి తగ్గలేదు. దీంతో రెండు పార్టీల మహిళా విభాగాల మధ్య సోషల్ మీడియా యుద్ధం మరింత వేడెక్కింది.
ఈ వివాదంపై ఇప్పటివరకు పెద్ద నాయకులు మౌనంగా ఉన్నప్పటికీ, మహిళా విభాగాల వ్యాఖ్యలు మాత్రం రాజకీయ వాతావరణంలో కొత్త చర్చలకు దారితీశాయి.