చంద్రబాబు గురించి రోశయ్య చెప్పిన చేదు నిజం

మాట నిలబెట్టుకునేవాడు వైఎస్ఆర్.. కానీ మాట తప్పేవాడు చంద్రబాబు. ఈ విషయం ఇప్పుడే కాదు అనాదిగా నాటి దిగ్గజ రాజకీయ నాయకుడు రోశయ్యనే చెప్పాడు. వైఎస్ఆర్ పాలనకు ముందు చంద్రబాబు ఇలానే తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన వైనంపై సీనియర్ కాంగ్రెస్ నేత రోశయ్య సెటైర్లు కురిపించారు.

అధికారం దక్కడానికి చంద్రబాబు ఏమైనా చేస్తాడని.. ఎన్ని తప్పుడు హామీలు అయినా ఇస్తాడని.. గెలిచాక నాకు పాలన చేత కావడం లేదని.. డబ్బులు లేవని చేతులెత్తేస్తాడని రోశయ్య ఆనాడే చెప్పాడు. అప్పుడు అలానే చేశాడు.. ఇప్పుడు చంద్రబాబు అదే చేశాడు.

తాజాగా నిన్న ప్రెస్ మీట్ లో కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు తప్ప ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఖజానాలో డబ్బులు లేవని.. అందుకే సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని స్పష్టం చేశారు.

దీంతో చంద్రబాబు మరోసారి వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అని అర్థమైపోయింది. నమ్మి ఓట్లు వేసిన జనాలు, ప్రతిపక్ష వైసీపీ దీన్ని ఎలా ముందుకు తీసుకెళుతుందన్నది ఆసక్తి రేపుతోంది.

నాడు రోశయ్య ఏం మాట్లాడాడో ఈ వీడియోలో చూద్దాం.

వీడియో కోసం క్లిక్ చేయండి