జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రుషికొండ ప్రభుత్వ భవనంపై చేసిన ఆరోపణలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల భవనంలోని పెచ్చులు ఊడిపోయాయని చూపిస్తూ ఆయన మీడియా ముందుకు వచ్చారు. అయితే ఆ ఘటనను పరిశీలించిన నెటిజన్లు వేరే నిజాన్ని వెలుగులోకి తెచ్చారు.
పెచ్చు ఊడిందని చూపించినా, అవి సహజంగా కింద పడకుండా కొంత దూరంగా పక్కకు పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే వాటిని ఎవరైనా కోసి అక్కడ ఉంచినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు కేవలం “డైవర్షన్ డ్రామా”గా మారిపోయాయి.
ఇక సోషల్ మీడియా వేదికలపై పవన్‌ను నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తున్నారు. “సొంతంగా పెచ్చు లాగి మీడియా ముందు నాటకాలు ఆడుతున్నారు”, “ప్రజలను మోసం చేసే ప్రయత్నం విఫలమైంది” అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ సంఘటనతో టీడీపీ–జనసేనల కలయికలోని దొంగనాటకాలు బహిర్గతమయ్యాయని పాలకపక్షం చెబుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం నిజాలను వక్రీకరించడం ఎంతకాలం సాధ్యమవుతుందో చూడాలి కానీ, ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ అడ్డంగా దొరికిపోయినట్టే కనిపిస్తోంది.