Top Stories

ఏపీలో బీజేపీకి ఏంటీ వింత పరిస్థితి

జాతీయ స్థాయిలో బీజేపీ అపారమైన బలాన్ని, అధికారాన్ని కలిగి ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ పార్టీ ఒక వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. కేంద్రంలో అధికారంలో ఉన్నా.. ఏపీలో పొత్తు లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని స్థితిలో ఉంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. ఈ కూటమి సాయంతోనే ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అధికారాన్ని దక్కించుకోగలిగారు. సరిగ్గా ఇదే కారణం చేత, ఏపీకి కేంద్రం చేసిన మేలును, అలాగే విభజన సమయంలో ఏపీ ప్రయోజనాల కోసం బీజేపీ నాయకులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ వంటివారు చేసిన పోరాటాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రచారం చేసుకోలేక పోతున్నారు.

కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ కూటమి ద్వారా దక్కాల్సిన రాజకీయ ప్రయోజనాలు ఆ పార్టీకి దక్కడం లేదు. టీడీపీ ‘పెద్దన్న’ పాత్ర పోషిస్తుండటం, రాష్ట్ర బీజేపీలో టీడీపీ నేపథ్యం ఉన్న నేతలే అధికంగా ఉండటం.. కేంద్ర పెద్దలు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో… ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి మాటే చెల్లుబాటు అవుతోంది.

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఈ మధ్యకాలంలో భారీగా సహాయం చేస్తోంది. అమరావతి రాజధానికి రూ. 15,000 కోట్లు అందించడం… పోలవరం ప్రాజెక్టుకు ఎనలేని సహకారం ఇచ్చింది. రోడ్డు-రైల్వే ప్రాజెక్టుల అదనంగా కేటాయింపులు చేసింది. విశాఖపట్నంలో ప్రభుత్వ రంగ సంస్థల రూపంలో భారీ పెట్టుబడులు పెట్టంది. ఇంత చేసినా, ఈ సాయం బీజేపీ వల్లే దక్కిందని ఏపీ ప్రజలకు వివరించడంలో, ప్రచారం చేయడంలో రాష్ట్ర బీజేపీ నాయకులు విఫలమవుతున్నారు.

వాస్తవానికి, ఏపీలో టీడీపీ కంటే బీజేపీయే సీనియర్ పార్టీ. టీడీపీ ఆవిర్భావం సమయంలోనే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుంది. విభజన సమయంలో ఏపీ ప్రయోజనాల కోసం పోరాడిన చరిత్ర కూడా ఉంది. ఇన్ని సానుకూల అంశాలు ఉన్నా, రాష్ట్రంలో సొంత బలాన్ని పెంచుకునే ప్రయత్నం ఏపీ బీజేపీ చేయడం లేదు.

ఏ రాజకీయ పార్టీ అయినా తమ బలాన్ని నమ్ముకొని ఎదగాలి. కానీ ఏపీలో బీజేపీ ఎదుగుదల కనిపించడం లేదు. మరో పార్టీ బలాబలాలపై ఆధారపడటం మానుకొని, తమ సొంత బలాన్ని అభివృద్ధి చేసుకుంటేనే ఆ పార్టీకి మనుగడ. లేదంటే, రాబోయే కాలంలో కూడా ఆ పార్టీకి పొత్తులే శరణ్యం అవుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Trending today

జగన్ నినాదాలు చేయడం నేరమైపోయిందా?

ఖమ్మం జిల్లాలో వైయస్ఆర్సీపీ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్...

ఏపీలో మందుబాబుల కడుపు కొట్టిన కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మద్యపాన ప్రియులకు షాక్...

చంద్రబాబు, రేవంత్, పవన్, కేసీఆర్, జగన్ కలిసి పండుగ చేస్తే.. వీడియో వైరల్

తెలుగు రాజకీయాల్లో ఎప్పుడూ కనిపించే తీవ్ర విభేదాలకు పూర్తిగా భిన్నంగా, తాజాగా...

చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ కేసు క్లోజ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ఉన్న స్కిల్‌ స్కామ్‌...

చంద్రబాబుపై పవన్ స్వామి ‘భక్తి’ పీక్స్

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం...

Topics

జగన్ నినాదాలు చేయడం నేరమైపోయిందా?

ఖమ్మం జిల్లాలో వైయస్ఆర్సీపీ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్...

ఏపీలో మందుబాబుల కడుపు కొట్టిన కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మద్యపాన ప్రియులకు షాక్...

చంద్రబాబు, రేవంత్, పవన్, కేసీఆర్, జగన్ కలిసి పండుగ చేస్తే.. వీడియో వైరల్

తెలుగు రాజకీయాల్లో ఎప్పుడూ కనిపించే తీవ్ర విభేదాలకు పూర్తిగా భిన్నంగా, తాజాగా...

చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ కేసు క్లోజ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ఉన్న స్కిల్‌ స్కామ్‌...

చంద్రబాబుపై పవన్ స్వామి ‘భక్తి’ పీక్స్

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం...

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

Related Articles

Popular Categories