తిరుమల లడ్డూ ఘటనను రాజకీయంగా వైసీపీ వైపు మలచడానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. గోమాంసం, నెయ్యి కల్తీ వంటి విషయాలను భక్తుల మనోభావాలను రెచ్చగొట్టేలా వాడుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
“దేవుడితో రాజకీయాలు చేయడం మంచిది కాదు” అని వైఎస్సార్సీపీ నేతలు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. భక్తి, విశ్వాసాల పేరుతో రాజకీయ లాభం పొందాలని చూస్తే దానికి తగిన పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఇక ఈవో శ్యామలరావు స్పష్టంగా “కల్తీ నెయ్యి ట్యాంకర్లు ఎక్కడా వాడలేదు” అని ప్రకటించినప్పటికీ, కూటమి ప్రభుత్వ ప్రచార యంత్రాంగం వేరే దిశలో నడుస్తోందని విమర్శిస్తున్నారు.
జనభావాలను మాయ చేయడం కాదు, నిజాలను బయటపెట్టడమే నాయకత్వ ధర్మమని విమర్శకులు అంటున్నారు. “భోలే బాబా మాయ కాదు, ఇది చంద్రబాబు మాయ” అంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.
https://x.com/JaganannaCNCTS/status/1988093003534397571?s=20


