Top Stories

TV5 survey : కూటమికి 31 , వైసీపీకి 141 సీట్లు

టీవీ5 సర్వే రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు సమాధానంగా టీవీ5 యాంకర్ టీవీ స్క్రీన్‌పై చూపించిన సర్వే ఫలితాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

ఈ సర్వే ప్రకారం, టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి మొత్తం కేవలం 31 సీట్లకే పరిమితం అవుతుందని వెల్లడించారు. అందులో టీడీపీకి 27 సీట్లు, జనసేనకు 2 సీట్లు, బీజేపీకి 2 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పారు. అంటే 175 అసెంబ్లీ స్థానాల్లో మిగిలిన 145 సీట్లు వైసీపీ ఖాతాలో పడతాయని టీవీ5 యాంకర్ స్పష్టం చేశారు.

సాధారణంగా టీవీ5 సర్వేలు కనీస అంచనాలతోనే ఉంటాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. అలాంటప్పుడు ఈ స్థాయిలో వైసీపీకి భారీ ఆధిక్యం చూపించడమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, హామీల అమలుపై సందేహాలు, పాలనపై విమర్శలు ఈ సర్వే ఫలితాల్లో ప్రతిబింబించాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు వైసీపీకి ప్రజాభిమానమేం తగ్గలేదని, జగన్ నాయకత్వంపై నమ్మకం మరింత బలపడుతోందన్న సంకేతాలుగానే ఈ సర్వేను అభిమానులు చూస్తున్నారు. సంక్షేమ పథకాలు, నేరుగా ప్రజలకు అందిన లబ్ధి, గడపగడపకు ప్రభుత్వం వంటి కార్యక్రమాలు పార్టీకి బలంగా మారాయని వారు అంటున్నారు.

ఇక “Welcome to జగనన్న 2.0” అంటూ సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ఈ సర్వేను షేర్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ గెలుపు దాదాపు ఖాయమన్న భావన ఈ సర్వే ద్వారా స్పష్టమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో, రాజకీయ సమీకరణలు ఎలా మారతాయో చూడాల్సి ఉంది. కానీ టీవీ5 సర్వే మాత్రం కూటమికి గట్టి హెచ్చరికగా, వైసీపీకి ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంకేతంగా మారిందనడంలో సందేహం లేదు.

https://x.com/kurapati1005/status/2001474453650407705?s=20

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories