ఆంధ్రజ్యోతి చానెల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న వెంకటకృష్ణ తన ‘మనసులో మాట’ ద్వారా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా ఆయన వ్యాఖ్యానాలు, రాజకీయాలపై ఆయన వ్యక్తీకరిస్తున్న అభిప్రాయాలు చర్చకు దారితీస్తున్నాయి.
ఇటీవల గూగుల్ డేటా సెంటర్ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో, రాజకీయ పార్టీల్లో వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరింత హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రజలు యెల్లో మీడియాలోని వక్రీకరణను అర్థం చేసుకుని తగిన ప్రతిస్పందన ఇస్తున్నారని, మీడియాపై విశ్వాసం కోల్పోతున్నారని ఆయన తన మాటల్లో వ్యక్తం చేయడం విశేషం.
అయితే, నెటిజన్లు మాత్రం వెంకటకృష్ణను వదల్లేదు. “ప్రజలు ఏం అనుకుంటున్నారో ఇప్పుడు చెబుతున్నావా?”, “ఇప్పుడే నిజాలు గుర్తొచ్చాయా?”, “ముందు ఎవరి కోసం వాదించావో మర్చిపోయావా?” అంటూ ట్రోల్స్, మీమ్స్‌తో సోషల్‌మీడియాలో విరుచుకుపడుతున్నారు.
టీడీపీకి దగ్గరగా ఉన్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న వెంకటకృష్ణ ఈసారి గూగుల్ డేటా సెంటర్ వివాదంపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం నెటిజన్లకు కక్కలేక మింగలేని పరిస్థితి సృష్టించినట్టుగా ఉందని కొందరు విశ్లేషకుల అభిప్రాయం.
ప్రజలు ఇప్పుడు మీడియా కవరేజీని గమనించి, స్వతంత్రంగా అభిప్రాయాలు ఏర్పరుచుకుంటున్నారని, పాతపంథా ప్రచార విధానాలు ఇక పనిచేయవని సోషల్ మీడియా ప్రతిస్పందనలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
మొత్తం మీద, వెంకటకృష్ణ “మనసులో మాట” చెప్పిన తీరు ప్రజల్లో చర్చకు దారితీస్తే, నెటిజన్ల మీమ్స్ మాత్రం ఆ మాటలకే కొత్త అర్థం ఇచ్చేశాయి!
https://x.com/Samotimes2026/status/1980696142771024018