శ్రీ సత్యసాయి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రిలో వైసీపీ కార్యకర్త అశోక్‌పై టీడీపీ నేతలు విచక్షణారహితంగా దాడి చేశారు. కర్రలు, రాళ్లతో అతన్ని తీవ్రంగా కొట్టారు. అశోక్ చేస్తున్న కాంట్రాక్టు పనులు తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం.
మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది. టీడీపీ నేతల దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒకవైపు శాంతిభద్రతల పరిరక్షణ గురించి ప్రభుత్వం గొప్పలు చెబుతుంటే, మరోవైపు అధికార పార్టీ నేతలే ఇలా దాడులకు తెగబడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అశోక్‌పై దాడి చేసిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ కార్యకర్తలు, పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించకూడదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వీడియో కోసం క్లిక్ చేయండి