యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన బాలలను విశాఖపట్నానికి తీసుకొచ్చి, కనీసం వసతి సౌకర్యాలు కల్పించకుండా, వారికి సరిపడా తిండి పెట్టకుండా, చలిలో, దోమల బెడదలో పడుకోబెట్టిన కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మానవత్వం లేని ఇలాంటి ప్రభుత్వంలో మనం జీవిస్తున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 25 వేల మంది గిరిజన బాలలను బానిసలుగా చూసిన టీడీపీ, జనసేన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈ ఘటనపై టీవీ5లో జర్నలిస్ట్ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. “ఇంత పెద్ద ఈవెంట్ చేస్తే ఆ మాత్రం ఇబ్బంది ఉండదా?” అంటూ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు మానవత్వాన్ని పూర్తిగా విస్మరించినట్లు ఉన్నాయని పలువురు మండిపడుతున్నారు. పిల్లల పట్ల కనీస కనికరం లేకుండా మాట్లాడిన సాంబశివరావుపై విమర్శల వర్షం కురుస్తోంది.
సాంబశివరావు వ్యాఖ్యలు ప్రజల ఆగ్రహాన్ని మరింత పెంచాయి. ముఖ్యంగా గిరిజన బాలల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు, దాన్ని సమర్థిస్తూ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు సమాజంలో తీవ్ర చర్చకు దారితీశాయి. మానవ హక్కులు, పిల్లల సంరక్షణపై కనీస అవగాహన లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
ఈ సంఘటన ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, బాధ్యతారాహిత్యాన్ని స్పష్టంగా చూపుతోంది. భవిష్యత్ తరాలైన పిల్లల పట్ల కనీస బాధ్యత లేకుండా, వారిని ఇబ్బందులకు గురిచేయడం అత్యంత దారుణం. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంలో టీవీ5 సాంబశివరావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా పలువురు కోరుతున్నారు. జర్నలిస్టులు సమాజానికి వాస్తవాలను తెలియజేయాలి తప్ప, అన్యాయాన్ని సమర్థించకూడదని హితవు పలుకుతున్నారు.
వీడియో కోసం క్లిక్ చేయండి