బీహార్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. బీహార్లో ఎన్డీఏ ఓడిపోతే, జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ బిజెపి నుంచి దూరం కావడం ఖాయమని అంచనాలు ఉన్నాయి. అటువంటి పరిణామం వస్తే ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టిడిపి కూడా పునరాలోచనలో పడే అవకాశం ఉంది.
ఇక వైసీపీ ఇప్పటికే బిజెపి వైపు దగ్గరగా వెళ్లిన సంకేతాలు ఇస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి మద్దతు ప్రకటించడం ఆ దిశలోనే భాగమని చెప్పబడుతోంది. మరోవైపు జగన్, చంద్రబాబు – రాహుల్ గాంధీ మధ్య ఉన్న టచ్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం మీద బీహార్ ఎన్నికల ఫలితాలు అక్టోబర్లో వెలువడిన వెంటనే, ఏపీలోనూ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తోంది.