ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుఫాన్ ప్రభావం తగ్గకముందే, సోషల్ మీడియాలో మరో తుఫాన్ హోరెత్తుతోంది. అదే ఎల్లో మీడియా ఎలివేషన్ తుఫాన్.
చంద్రబాబు తుఫాన్ సమయంలో చేసిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌పై మహా టీవీ వంటి ఛానళ్లలో అతిగా పొగడ్తలు, ఎలివేషన్లు, “చంద్రబాబు నిద్రపోడు – మిగతావారిని నిద్రపోనివ్వడు” అంటూ చర్చలు హోరెత్తుతున్నాయి.
మహా టీవీ చర్చల్లో పాల్గొన్న వంశీ వంటి అనుచరులు చంద్రబాబును ఆకాశానికెత్తుతూ మాట్లాడుతూ “చంద్రబాబు గొప్పగా పనిచేశాడు… ఒకవేళ అవకాశం ఉంటే మొంథా తుఫాన్‌ని కూడా వెనక్కు తిప్పేవాడు!” అని కామెంట్లు చేశారు.
ఇక అదే క్రమంలో మరింత ఎలివేషన్లతో “మళ్ళీ తుఫాన్ వస్తే దాన్ని మళ్లించడానికి కొత్త టెక్నాలజీ కనిపెట్టేది చంద్రబాబే” అంటూ చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు చవకబారు ఫ్యూయల్ ఇచ్చారు.
ట్విట్టర్ (X), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో నెటిజన్లు ఈ ఎలివేషన్లపై మీమ్స్, సెటైర్లు, ప్యారడీలు కురిపిస్తున్నారు. “మొంథా తుఫాన్ కంటే చంద్రబాబు ఎలివేషన్ తుఫాన్ పెద్దది!”, “తుఫాన్ రాకముందే ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఆపిన లెజెండ్” వంటి మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ ఎలివేషన్‌ల వెనుక ఉన్న ఉద్దేశంపై చర్చ మొదలైంది. విపక్షాలు “ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మీడియా ప్రచారం కోసం వేదికలుగా మారడం సిగ్గుచేటు” అంటుండగా.. టిడిపి అనుచరులు మాత్రం “నాయకుడి కృషిని గుర్తించడం తప్పేంటి?” అంటున్నారు.
ఏది ఏమైనా… మొంథా తుఫాన్ దాటిపోయింది కానీ, ఎల్లో ఎలివేషన్ తుఫాన్ ఇంకా కొనసాగుతూనే ఉంది!


