ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ హీట్ పెరిగింది. ఈ ప్రాజెక్ట్ ఎవరి హయాంలో మొదలైంది? ఎవరి కృషి ఎక్కువ? అన్న అంశంపై జరుగుతున్న చర్చలో టీడీపీ, బీజేపీ పార్టీలు అనుకోకుండా ఒక “ట్రాప్”లో పడ్డాయన్న వాదన ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది.
వైసీపీ శ్రేణులు తెరపైకి తెచ్చిన వీడియోలు, అధికారిక డాక్యుమెంట్లు, తేదీల ఆధారాలతో భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం వైసీపీ పాలనలో ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే వేగం పుంజుకుందనే వాదన బలంగా నిలిచింది. ఈ క్రెడిట్ తమదేనని వైసీపీ స్పష్టంగా చెప్పడంతో ప్రతిపక్షాలు దానికి కౌంటర్లు ఇవ్వాల్సిన పరిస్థితిలోకి వెళ్లాయి.
ఈ మొత్తం వ్యవహారంపై ABN Live స్టూడియోలో జరిగిన చర్చ మరింత చర్చనీయాంశమైంది. యాంకర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ “ఈ క్రెడిట్ ఎవరిది అనే ట్రాప్‌లో టీడీపీ, బీజేపీ పడిపోయాయి”
అని వ్యాఖ్యానించడంతో వాతావరణం మారిపోయింది. ఆ సమయంలో స్టూడియోలో ఉన్న టీడీపీ, బీజేపీ ప్రతినిధులు స్పష్టమైన ఖండన చేయలేక మౌనంగా ఉండటం గమనార్హం. అది అంగీకారమేనని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.
“భోగాపురం మా జగన్ అన్న కట్టాడు” అన్న నినాదానికి ప్రతిగా టీడీపీ, బీజేపీలు గంటల కొద్దీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు, డెమోన్స్ట్రేషన్లు చేస్తూ “జగన్ క్రెడిట్ కాదు” అని నిరూపించేందుకు ప్రయత్నించాయి. కానీ ఆ ప్రయత్నాలే చివరకు వైసీపీ వాదనకు ప్రచారం తెచ్చినట్టయ్యిందన్న విమర్శ వినిపిస్తోంది.
ఏబీఎన్ లైవ్ చర్చ ముగిసే సరికి క్రెడిట్ డిబేట్ పూర్తిగా జగన్ చుట్టూనే తిరిగింది. టీడీపీ–బీజేపీలు సమాధానాలు చెప్పుకోవడానికే పరిమితమయ్యాయి. “ట్రాప్” అన్న పదమే సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. దీనిపై వెంకటకృష్ణ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ భోగాపురం క్రెడిట్ అంశం చివరకు జగన్‌కే వెళ్లిపోయిందని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
రాజకీయాల్లో ఒక్కసారి ఫ్రేమ్ సెట్ అయితే ఎన్ని కౌంటర్లు ఇచ్చినా ప్రయోజనం ఉండదని ఈ ఉదంతం మరోసారి రుజువైంది.


