రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం రెండు ప్రధాన పార్టీల తీరు చర్చనీయాంశమైంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అనే పేరుతో గుడ్డి విధేయత కనిపిస్తుండగా, తెలుగుదేశం పార్టీలో మాత్రం అతి మేధావితనం పార్టీకి మైనస్‌గా మారుతోంది.
జగన్మోహన్ రెడ్డి చెప్పిందే ఫైనల్ అనే భావన వైసీపీ శ్రేణుల్లో బలంగా ఉంది. అధినేత ఆదేశం అనగానే విన్నపాలు లేకుండా ఆచరిస్తారు. అదే క్రమశిక్షణ వైసీపీకి ఒకపక్క బలం అయ్యింది.. ఇవే వైసీపీ స్వభావం బలగంగా మారింది..
ఇక తెలుగుదేశం పార్టీలో పరిస్థితి తారుమారుగా ఉంది. అక్కడ అధినేత చంద్రబాబుకంటే తామే తెలివైనవారమని భావించే మేధావులు అధికం. ఎవరికి ఏది నచ్చకపోతే అదే బహిరంగ చర్చకు వస్తుంది. ఎవరైనా ఉచిత సలహా ఇచ్చే దారిలో పార్టీ క్రమశిక్షణ దెబ్బతింటుంది.
వైసీపీలో అధినేత చెప్పిన మాటే శాసనం. టిడిపీలో అయితే ప్రతి నేతకు ఒక అభిప్రాయం. ఇదే తేడా రెండు పార్టీల భవిష్యత్తును నిర్ణయిస్తోంది. వైసీపీకి జగన్ ప్లస్‌గా, టిడిపికి మేధావితనం మైనస్‌గా మారిన పరిస్థితి ఇది.


