ఏపీ రాజకీయాలు ఎప్పుడూ హీట్‌లోనే సాగుతుంటాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్, టిడిపి అధినేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం ఎప్పటికప్పుడు చర్చనీయాంశమే అవుతుంది. తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి.
రైతులకు యూరియా కూడా ఇవ్వని చంద్రబాబు.. “ఎందులైనా అయినా దూకి చావండి” అంటూ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలు బయటకొచ్చిన వెంటనే మహా టీవీ యాంకర్ వంశీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. “చంద్రబాబునే అంత మాట అంటావా?” అంటూ ఆయన అసహనం వ్యక్తం చేస్తూ జగన్‌పై సెటైర్లు వేశారు.
మహా వంశీ తన స్టైల్‌లోనే ఈ కామెంట్లను ఎగదోస్తూ మాట్లాడటం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొందరు ఆయన మాటలపై నవ్వులు పూయగా.. మరికొందరు సెటైరికల్ మీమ్స్‌తో హోరెత్తించారు. “వంశీ రియాక్షన్ చూసి పగలబడి నవ్వేశాం”, “ఇదే వంశీ స్టైల్.. ఫుల్ కామెడీ” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అసలు విషయానికి వస్తే.. ఏపీ రాజకీయాల్లో ఒకరిపై ఒకరు మాటలతో దాడి చేయడం కొత్తేమీ కాదు. కానీ ఆ రాజకీయ వ్యాఖ్యలపై మీడియా వ్యక్తులు రియాక్ట్ అవ్వడం మాత్రం సోషల్ మీడియాలో అదిరిపోయే ట్రోల్స్‌కు కారణమవుతోంది. ప్రస్తుతం వంశీ రియాక్షన్ కూడా అలాంటి కామెడీ కితకితలకే దారితీసింది.
మొత్తంగా చెప్పాలంటే.. జగన్ కామెంట్లు, వంశీ రియాక్షన్, సోషల్ మీడియాలో ట్రోల్స్ అన్నీ కలిపి మరోసారి ఏపీ రాజకీయాలను వినోదాత్మక మలుపులోకి తీసుకెళ్లాయి.